తమిళనాడు ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీకి చెందిన వ్యక్తి.. CM విజయ్‌కు సన్నిహితుడు, టీవీకేలో కీలకం

Wait 5 sec.

పాలనాపరమైన అంశాలలో బిజీ అయ్యారు.. శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయ్ ప్రభుత్వ సలహాదారుల్ని నియమిస్తున్నారు.. వారిలో ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. తాజాగా ఇద్దర్ని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా నియమించారు.. విష్ణురెడ్డి, జాన్ ఆరోక్యసామిలకు కీలక బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఏపీకి చెందిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి బంధువు (బావమరిది) అవుతారు. విష్ణురెడ్డిని తమిళనాడు ప్రజా కార్యక్రమాలు, సాధారణ వ్యవహారాల సలహాదారుగా శుక్రవారం రోజు నియమించారు.ఎర్రదొడ్డి విష్ణురెడ్డి పూర్తిపేరు విష్ణువర్ధన్‌ రెడ్డి.. ఆయన సొంత ఊరు అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలోని ఎర్రదొడ్డిపల్లె. విష్ణు రెడ్డి గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ 15ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విజయ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా విష్ణురెడ్డి గుర్తింపు వచ్చింది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌ను కలిసిన సమయంలో విష్ణురెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో విష్ణురెడ్డి గురించి తమిళ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చర్చ జరిగింది. విష్ణురెడ్డి టీవీకేకు వ్యూహకర్తల్లో ఒకరని, ఆర్థిక వ్యవహారాల్లో సాయం చేశారనే ప్రచారం ఉంది. అంతేకాదు విజయ్‌ సినిమాల పర్యవేక్షణ బాధ్యతల్ని విష్ణు రెడ్డి చూసుకున్నారనే టాక్ కూడా వచ్చింది. విజయ్ నియమించిన మరో సలహాదారు ఆరోక్యసామి టీవీకేకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. విష్ణు రెడ్డి గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తున్నారు.. ఆయన పదిహేనేళ్లుగా గ్రానైట్‌ వ్యాపారం చేస్తూ చెన్నైలో ఉంటున్నారు. ఆయన తండ్రి రామనారాయణరెడ్డి రాజకీయాల్లో ఉన్నారు.. ఆయన అద్దవారిపల్లె సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత మహల్‌ ఎంపీటీసీగా, కలికిరి మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీగా పనిచేశారు. రామనారాయణరెడ్డి కుటుంబానికి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయని చెబుతుంటారు. రామనారాయణ రెడ్డి భార్య (విష్ణు తల్లి) కలికిరి మాజీ ఎంపీపీ నల్లారి ఆనంద రెడ్డి సోదరి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ రెడ్డిల సోదిరిని విష్ణు రెడ్డి కుటుంబంలో వారితో వివాహమైంది. విష్ణురెడ్డి చెన్నై స్థిరపడి విజయ్ సినిమా వ్యవహారాలు చక్కదిద్దేవారు.. ఆ తర్వాత టీవీకే పార్టీలో కీకలంగా వ్యవహరించారు. చాలా ఏళ్లుగా విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమించారు. గతంలో జ్యోతిష్యుడు రతన్ పండిట్‌ను కూడా సలహాదారుడిగా నియమించిన సంగతి తెలిసిందే. పండిట్ నియామకంపై మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత రావంతో.. ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. మరి ఈ ఇద్దరు సలహాదారుల నియామకంపై మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.