అధినేత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేరుతో కమిటీ ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా.. జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా ‘సేనా గళం’ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా సేనా గళం కమిటీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు , కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలనే బూర్జువా ధోరణిని పక్కనపెట్టి సేనా గళం కమిటీ పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అభ్యుదయ భావాలతో ముందుకెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని సూచించారు. రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తూ సేనా గళం ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.తప్పులను కప్పి పుచ్చుకునేందుకు భావావేశాల ముసుగుమరోవైపు రాజకీయాల్లో కొంతమంది కావాలనే వారి తప్పులను వ్యక్తిగతంగా కాకుండా కులం, మతం, వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇది సమాజంలో విద్వేషాలకు కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని వారు గుర్తించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలన్న పవన్ కళ్యాణ్.. సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని స్పష్టం చేశారు.