Sector: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి తెలిపారు. భవిష్యత్తు డిజిటల్ అవసరాలను తీర్చేందుకు, కొత్త ఆవిష్కరణల కోసం అటు ఫిన్‌టెక్, ఇట్ ఇన్సూరెన్స్ టెక్ కంపెనీలతో పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వివరాలు వెల్లడించారు.బీమా వ్యాపారం మాత్రమే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఎదిగిందని, అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్లు సీఈఓ దొరైస్వామి తెలిపారు. పాలసీదారులకు మెరుగైన ప్రతిఫలం అందించేందుకు ప్రత్యేకమైన కంపెనీల్లో వ్యూహాత్మక పెట్టుబడులకూ ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీని ఎల్ఐసీ వేగంగా అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. తమ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా సొంతంగానే తమ బిజినెస్ యాప్స్ తయారు చేసుకుంటున్నట్లు తెలిపారు. దొరైస్వామి చెప్పారు. ఫిన్‌టెక్ రంగంలో పోటీలో నిలదొక్కుకునేందుకు ఐటీ అప్లికేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరు ఉందని పేర్కొన్నారు. ఎల్ఐసీలో తదుపరి వాటాల విక్రయంపై అడగగా పబ్లిక్ షేర్ హోల్డింగ్ పరిమితిని పెంచేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని ఆయన చెప్పారు.'సహజంగానే, ఆధునికీకరణ అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా ఆవిష్కరణలను తీసుకురావడానికి, మేము ఫిన్‌టెక్, ఇన్సూర్‌టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము. ఈ సంస్థల ద్వారా అనేక కొత్త విషయాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. మేము అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టే ఒక పెద్ద ఆర్థిక సంస్థ. పాలసీదారుల నిధులపై రాబడిని మెరుగుపరిచే మార్గంగా, ఏదైనా ప్రత్యేక రంగంలోని సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడులను కూడా మేము పరిశీలిస్తాము.' అని దొరైస్వామి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.