రానుంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనకు సమాచారం అందించినట్లు మాధవ్ తెలిపారు. రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానుంది. ఇక విశాఖ కేంద్రంగా విశాఖ - విజయవాడ బుల్లెట్ రైలు కూడా రానుంది. సాగరతీరం విశాఖపట్నం విజయవాడ మధ్య 350 కిలోమీటర్లకుపైగా దూరం ఉంది. ఈ రెండు ప్రధాన నగరాలను కలిపేలా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ బుల్లెట్ రైలు అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ను తొలుత గంటకు 320 కి.మీ వేగంతో నడపాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత బుల్లెట్ రైలు వేగాన్ని 600 కి.మీలకు పెంచాలని భావిస్తున్నారు. కనీసం గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించినా విశాఖపట్నం నుంచి విజయవాడకు గంటన్నరలోనే చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు అదికారులు ప్రతిపాదనలు పంపించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఏడు ఏర్పాటుచేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు కారిడారు, చెన్నై - బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. వీటికి తోడుగా విజయవాడ - విశాఖపట్నం మధ్య కూడా మరో హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖ - విజయవాడ హైస్పీడ్ రైల్ వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వీటితో పాటుగా విజయవాడ - కర్నూలు నగరాల మధ్యన సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి కర్నూలుకు రెండు గంటల్లో చేరుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.