దుమ్మురేపుతున్న ఐటీ స్టాక్.. 4 ఏళ్లకే లక్షకు రూ.30 లక్షలు.. ఇప్పుడు 10 షేర్లు కొంటే 100 షేర్లు ఇస్తోన్న కంపెనీ!

Wait 5 sec.

Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీ E2E నెట్ వర్క్స్ లిమిటెడ్ (E2E Networks Limited) స్టాక్ దుమ్మురేపుతోంది. ఈ కంపెనీ స్టాక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి భారీ ర్యాలీ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. అంతే కాదు ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. రికార్డు డేట్ జూన్ 5గా నిర్ణయించారు. ఆ రోజున ఈ స్టాక్ ఎక్స్- స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహిస్తుంది. స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ సమీపిస్తున్న క్రమంలో వసరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. E2E నెట్ వర్క్స్ లిమిటెడ్ అనేది దిగ్గజ సంస్థ L&Tకి చెందిన బ్యాక్ ఎండ్ కంపెనీ. మరి ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ షేరు 2022, ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ అయింది. గడిచిన నాలుగేళ్ళ కాలంలో తమ షేర్ హోల్డర్లకు భారీ రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్టాక్ 4 ఏళ్లలోనే ఏకంగా 2913 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది. అంటే నాలుగేళ్ల క్రితం ఇందులో రూ.1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసిన ఇప్పటి వరకు కొనసాగిన వారికి రూ.30 లక్షలకు పైగా వస్తాయి. అయితే ఈ స్టాక్ స్ప్లిట్ అనంతరం ప్రస్తుతం రూ. 4324 వద్ద ఉన్న షేర్ ధర సుమారు రూ. 432 స్థాయికి తగ్గనుంది. అయితే ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. తమ పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండదు. తమ ఖాతాలో షేర్ల సంఖ్య 10 రెట్లు పెరుగుతుంది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవల జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 61కి అనుగుణంగా 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలనే నిర్ణయానికి ఆమోదం లభించింది. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 ఈక్విటీ షేర్స్ విభజిస్తారు. అలాగే ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ జూన్ 5, 2026గా నిర్ణయించారు. వారి ఖాతాలో షేర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆ తర్వాత ఈ స్టాక్ పెరిగితే వీరికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్లకు తమ షేరు అందుబాటులో ఉండేలా చూసేందుకు స్టాక్ స్ప్లిట్ చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది. 4 ఏళ్లలో 2900 శాతం లాభాలుఈరోజు ట్రేడింగ్ సెషన్లో E2E నెట్ వర్క్స్ లిమిటెడ్ షేరు 5 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి రూ. 4324.40 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర సైతం ఇదే కావడం గమనార్హం. అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 1,833.60 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు సుమారు 7.7 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజులల్లో ఈ షేరు 52 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 96 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 49 శాతం లాభాన్ని అందించింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో 2913 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 8890 కోట్లుగా ఉంది.