పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్.. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

Wait 5 sec.

తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ తగిలింది. ఇప్పటికే సంగతి తెలిసిందే. అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన సభ లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో తెలంగాణ నవ నిర్మాణ సభ నిర్వహించాలని మొదట జనసేన పార్టీ భావించింది. అయితే ఈ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో జనసేన పార్టీ నేతలు హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాజాగా హైకోర్టు తిరస్కరించింది. జనసేన పార్టీ సభకు అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉండగా.. ఈ అత్యవసర పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. ఇందులో అంత ముఖ్యమైన విషయం లేదని పేర్కొంటూ.. హైకోర్టు రిజిస్ట్రీ విచారణ జరిపేందుకు తిరస్కరించారు. ఇక తెలంగాణ హైకోర్టు నుంచి రాకపోవడం, పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. ఇవాళ సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో జనసేనాని ఏం మాట్లాడనున్నారనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారింది. ఇటీవల .. తెలంగాణలో సంచలనంగా మారింది.