RCB టైటిల్ గెలిచిన కొద్దిగంటల్లోనే గుజరాత్ టీమ్ బస్‌కి ప్రమాదం.. ఆటగాళ్లంతా ఆ బస్సులోనే!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్.. ఫైనల్‌లో కూడా ఓటమిపాలయింది. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వన్‌సైడ్ విక్టరీతో రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, ఫైనల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లంతా టీమ్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దాంతో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫైనల్ ఓడిపోయామన్న బాధలో ఉన్న గుజరాత్‌కి వెంటనే ఇలా జరగడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత టైటిల్ ప్రధానోత్సవం జరిగింది. శుభ్‌మన్ గిల్ రన్నరప్ ట్రోఫీ తీసుకున్న తర్వాత జట్టు మొత్తం హోటల్‌కు బయల్దేరింది. ఈ సమయంలో జట్టు ప్రయాణిస్తున్న బస్సలు అకాస్మత్తుగా షార్ట్ సర్క్యూట్ జరడగంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఆటగాళ్ల, సపోర్ట్ స్టాఫ్ వెంటనే బస్సు దిగేశారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏం జరగకపోయినా.. దాదాపు గంటపాటు ఆటగాళ్లు రోడ్డుపైనే ఇరుక్కుపోయినట్లు సమాచారం. ప్లే ఆఫ్స్ మొదలైన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు కనీసం రెస్ట్ కూడా లేకుండా పోయింది. మే 27న ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో క్వాలిఫయర్ 1 ఆడిన గుజరాత్.. ఆ వెంటనే ముల్లాన్‌పూర్ చేరుకుంది. మే 29న క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత రోజే అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. న్యూ చండీగఢ్‌లో తుఫాన్ కారణంగా శనివారం సాయంత్రానికి అహ్మదాబాద్ చేరుకున్నారు. మే 30న ఉదయం సమయానికే అహ్మదాబాద్ రావాల్సి ఉండగా.. సాయంత్రం చేరుకోవడంతో ప్లేయర్లకు విశ్రాంతి లేకపోవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయలేకపోయారు. ఈ వరుస ప్రయాణాలు, అలసట కూడా ఫైనల్‌లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. కానీ, ఏదిఏమైనా ఫైనల్స్ ఆడక తప్పలేదు. మ్యాచ్ ఓటమికి తోడు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంతో గుజరాత్ టైటాన్స్‌కు వరుస దెబ్బలు ఎదురయ్యాయి.