మోదీ చెప్పక ముందే తగ్గించేశారు.. ముందు చూపు.. విమాన ప్రయాణాలపై కీలక రిపోర్ట్

Wait 5 sec.

Air Travel: ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో మూడు నెలలుగా ఉద్రిత్తత పరిస్థితులు నెలకొన్నాయి. హార్ముజ్ జల సంధిని మూసి వేయడంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర 110 డాలర్లు దాటింది. ఇది భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. నరేంద్ర మోదీ మే 10వ తేదీన హైదరాబాద్ పర్యటన సందర్భంగా పిలుపునిచ్చారు. అత్యవసరం అయితే తప్పా విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని, విమాన ప్రయాణాలను తగ్గించాలని కోరారు. అయితే, అంతకు ముందు నెలలోనే భారతీయులు విమాన ప్రయాణాలను భారీగా తగ్గించారు. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. దేశీయంగా విమాన ప్రయాణాలు ఏప్రిల్‌లో కొంత మేర నెమ్మదించినట్లు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ గణాంకాలు వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో 1.44 కోట్ల మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించారని, అది ఏప్రిల్ నాటికి 4.2 శాతం మేర తగ్గి 1.38 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. 2025, ఏప్రిల్ నెలలో ప్రయాణించిన 1.43 కోట్ల మందితో పోలిస్తే ఈసారి 3.47 శాతం మేర తగ్గినట్లు వెల్లడించింది. విమాన ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, విమాన టికెట్ల ధరలు పెరగడం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులు అదుపు చేసుకునేందుకు కంపెనీల నిర్వహకులతో పాటు ప్రజలు సైతం ప్రయాణాలు తగ్గించుకోవడమే ఇందుకు కారణమని చెప్పారు. 2025లో ఇదే సమయంలో 575.13 లక్షల మంది కంటే ఈ సంఖ్య 0.06 శాతం ఎక్కువగా ఉంది. మరోవైపు.. ప్రయాణికులను అత్యధికంగా చేర వేసిన సంస్థగా దిగ్గజ ఏవియేషన్ సంస్థ ఇండిగో నిలిచింది. అలాగే సమయ పాలనలోనూ ఈ కంపెనీనే 88.5 శాతంతో అగ్ర స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్ 82.4 శాతం, ఆకాశ ఎయిర్ 81.4 శాతం, అలయన్స్ ఎయిర్ 71.2 శాతం, స్పైస్ జెట్ 31.2 శాతం మేర ఉన్నాయి. మొత్తం విమాన సర్వీసుల్లో 1.12 శాతం రెండు గంటలకు మించి ఆలస్యం అయ్యాయి. 1.35 లక్షల మంది ఆలస్యం వద్ద ఇబ్బందులు పడ్డారు. వీరి సదుపాయాల కోసం రూ. 2.41 కోట్లను కంపెనీలు వెచ్చించాయి. విమానల రద్దు కారణంగా 77,065 మంది అసౌకర్యానికి గురయ్యారు.