‘మూడేళ్ల పాటు 700 మంది అత్యాచారం’ పాక్ గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలపై బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

బ్రిటిష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ ఇటీవల చేసిన ప్రసంగం యునైటెడ్ కింగ్‌డమ్‌లో సంచలనం సృష్టిస్తోంది. చిన్నారులపై లైంగిక దోపిడీకు పాల్పడుతోన్న భయంకరమైన ‘గ్రూమింగ్ గ్యాంగ్‌ల’పై మళ్లీ చర్చను రాజేసింది. ఈ గ్యాంగ్‌లపై యూకే ప్రభుత్వం జరిపిన దర్యాప్తులో బాలలపై వ్యవస్థీకృత లైంగిక వేధింపులకు పాల్పడేవారు ఎక్కువగా పాకిస్థానీ మూలాలున్న టాక్సీ డ్రైవర్లు, మార్కెట్ వ్యాపారులు’ అని తేలింది. ఇటీవలి రూపెర్ట్ లోవ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ బాధితులు ఎదుర్కొన్న తీవ్రమైన లైంగిక వేధింపులు, మైనర్ బాలికల గర్భాలు, బెదిరింపులు, పోలీసుల నిర్లక్ష్యం, వ్యవస్థల వైఫల్యాలను సభ ముందు ఉంచారు. లైంగిక దోపిడీపై తాను స్వతంత్రంగా నిర్వహించిన విచారణలో ఈ సాక్ష్యాలు సేకరించినట్లు లోవ్ తెలిపారు. ‘‘ఈ ధైర్యవంతులైన బాధితుల గోడు పార్లమెంటు వినాలని, చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను’’ అని ఆమె అభ్యర్థించారు. గ్రూమింగ్ గ్యాంగుల లైంగిక దురాాగతాలుగ్రూమింగ్ గ్యాంగ్‌ల చేతుల్లో బాధితులు ఎదుర్కొన్న హింస, దారుణాలను బయటపెట్టారు. ఓ బాధితురాలు మాట్లాడుతూ ‘‘తనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఒక కామాంధుడు తన ప్రయివేట్ భాగాలపై మద్యం సీసాతో దాడిచేశాడని, ఆ క్రమంలో గాజు ముక్కలు లోపలే విరిగిపోయాయి’’ అని వాపోయింది. లైంగిక వేధింపులు జరుగుతున్న సమయంలో వివిధ ప్రాంతాల్లోని కొందరు పోలీసు అధికారులు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మరో బాధితురాలు ఆరోపించింది. ‘‘మూడేళ్ల కాలంలో సుమారు 600 నుంచి 700 మంది నాపై అత్యాచారం చేశారు’ అని 13 ఏళ్లుగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.నిజం చెప్తే చంపేస్తారనే భయంతో డ్రింక్‌లో ఏదో కలిపారని మాత్రమే వైద్యులకు చెప్పానని, వారు కూడా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి డిశ్చార్జ్ చేశారని 15 ఏళ్ల వయసులో దారుణమైన హింసకు గురై ఆసుపత్రి పాలైన ఒక బాలిక వివరించింది. కొన్ని సందర్భాల్లో దారుణాలు మరింత క్రూరంగా మారాయని, బాధితులను జంతువుల కంటే హీనంగా చూశారని వెల్లడైంది.‘‘ఒక వ్యక్తి వ్యాన్ వెనుక తలుపులు తీయడం నాకు గుర్తుంది. అక్కడ కుక్కల బోన్లలో 15 నుంచి 20 మంది బాలికలను బంధించి ఉంచారు’’ అని మరో మహిళ.. ‘‘తన చుట్టూ కుక్కలను వదిలారని, అక్కడ ఉన్నా ఎవరూ కాపాడటానికి ప్రయత్నించలేదు సరికదా పగలబడి నవ్వుతూ, బెట్టింగులు కాస్తూ ఆ దృశ్యాలను ఫోన్లలో రికార్డ్ చేశారు’’ అని మరో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ఆ వ్యక్తి నా ముఖాన్ని పట్టుకుని, నా కళ్లలోకి సూటిగా చూశాడు. నేను కుంగిపోవాలని కోరుకున్నాడు, అలాగే జరిగింది’’ అని ఆమె చెప్పింది. ‘‘నన్ను కింద పడేసి, ఒకరి తర్వాత ఒకరు వంతులవారీగా నాపై అత్యాచారం చేశారు. నా చేతులను, కాళ్లను కదలకుండా పట్టుకున్నారు. తర్వాత నన్ను దారుణంగా కొట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే, నన్ను వెతికి పట్టుకుని చంపుతామని బెదిరించారు.’’ అని మరో బాధితురాలు కన్నీటిపర్యంతమైంది.శ్వేతజాతీయులు, క్రైస్తవ బాలికలను నైతిక విలువలు లేనివారిగా చూసేవారని, ముస్లింలకు మాత్రమే గౌరవం ఉంటుందని అనేవారని మరో బాధితురాలు తెలిసింది. లైంగిక దోపిడీకి బాధితుల ఎంపికలో జాతి కూడా ఒక కీలకమైన పాత్ర పోషించిందని, బాధితుల్లో ఎక్కువ మంది శ్వేతజాతీయులేనని ఇంకో మహిళ పేర్కొంది.ప్రభుత్వ విచారణగతేడాది రూపెర్ట్ లోవ్ నేతృత్వంలో జరిగిన ఒక ప్రైవేట్ దర్యాప్తులో యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాల్లో ప్రధానంగా పాకిస్థానీ మూలాలు ఉన్న పురుషులే ఉన్నారని గత ఆగస్టులో ఒక ప్రకటనలో లోవ్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణాలు ఇంతలా పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు.యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్ చరిత్రగ్రూమింగ్ గ్యాంగ్స్ ఉదంతం తొలిసారి దశాబ్దం కిందట యార్క్‌షైర్‌లోని 'రోథర్‌హామ్'లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. 2001 ప్రాంతంలోనే శ్వేతజాతీయులైన చిన్నారులలపై వ్యవస్థీకృత లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. కానీ, ఈ కేసుల్లో మొదటి శిక్షలు 2010లో 12 ఏళ్ల చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడినందుకు ఐదుగురు పాక్ సంతతి వ్యక్తులకు జైలు శిక్ష పడింది. ఇదే తరహా ముఠాలు రోచ్‌డేల్, ఆక్స్‌ఫర్డ్, టెల్‌ఫోర్డ్, బ్రిస్టల్ వంటి దాదాపు 50 నగరాల్లో విస్తరించినట్లు కనుగొన్నారు. 2014లో ఓ నివేదిక ప్రకారం.. కేవలం రోథర్‌హామ్‌లోనే 1997 నుంచి 2013 మధ్య 1,400 మందికి పైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారు. వీటిపై చర్యలు తీసుకుంటే రెసిజమ్ అని ముద్ర వేస్తారనే భయంతో అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ దారుణాలు సాగాయని నివేదికలు చెబుతున్నాయి.