సీజ్ ద ప్రాపర్టీ.. కోడి చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కళ్యాణ్..

Wait 5 sec.

, జనసేన అధినేత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంపై తనకు ఎంతో ప్రేమ ఉందన్న పవన్ కళ్యాణ్.. అది రాజకీయాలకు అతీతమన్నారు. వారాహి యాత్ర మొదలుకుని అనేక సమయాల్లో తెలంగాణ ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తు చేశారుఇటీవల భారతదేశంలో అంతర్భాగమని వారికి గుర్తుచేశారు. తనకు అధికారంపై ప్రేమ లేదన్న పవన్ కళ్యాణ్.. మార్పుపైనే ప్రేమ ఉందని చెప్పారు. తనకు అధికారం కావాలని లేదని.. ముఖ్యమంత్రి కావాలనే ఆశే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదు.. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా అంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయమని తమ నేతలు చాలా సార్లు అడిగారన్న పవన్ కళ్యాణ్.. ఏపీలోనే అధికారం కోరుకోని వాణ్ని.. తెలంగాణలో అధికారం కోరుకుంటామా అని ప్రశ్నించారు. ఇక కోడిచెరువు కబ్జా చేశారనే ఆరోపణలపైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను కబ్జా చేశానని నిరూపిస్తే.. తన ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని.. పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదనే విమర్శలపైనా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాను బాధపడింది విభజన జరిగినందుకు కాదని.. విభజించిన తీరే బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో జనసేన పార్టీని విమర్శిస్తున్న వారు.. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలను ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. కేవలం జనసేన పార్టీనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పార్టీ కలిసి వస్తుందో, రాదో తనకు తెలియదని.. జనసేన పార్టీ మాత్రం కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. చావుకు సిద్ధపడే తాను పార్టీ పెట్టినట్లు తెలిపారు.