అన్నామలై 500 రోజుల ప్లాన్‌.. బీజేపీకి రూట్ మ్యాప్ చెప్పిన తమిళ నేత..!

Wait 5 sec.

తమిళనాడులో పేరెత్తగానే గుర్తుకు వచ్చే పేరు అన్నామలై. ద్రవిడ రాజకీయాలు బలంగా ఉన్న గడ్డ మీద.. హిందూత్వ వాదంతో ముందుకెళ్తున్న కాషాయ పార్టీ వైపు జనం దృష్టి మరల్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రచారం జరిగింది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడై నెల రోజులైనా కాకముందే.. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి, కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని వార్తలొచ్చాయి.రాజీనామా వార్తల వేళ ఢిల్లీ వెళ్లిన అన్నామలై బీజేపీ సీనియర్ నేత, హోం మంత్రి అమిత్ షాతోపాటు పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీ, పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను కలిశారు. అయితే ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకోవద్దని బీజేపీ అధిష్టానం అన్నామలైకు సూచించారని సమాచారం.ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై.. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారు. ఏళ్ల తరబడి తమిళనాడులో 2-3 శాతం ఓటింగ్‌కే పరిమితమైన బీజేపీ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో అన్నామలై సారథ్యంలో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసి 11.2 శాతం ఓట్లు సాధించింది. దీంతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్నామలై వ్యూహాలను రచించారు. అయితే తన సూచనలను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం, ఎన్నికల ముందు తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించడం పట్ల అన్నామలై అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.2024 లోక్ సభ ఎన్నికల సమయంలో అన్నామలై మాట్లాడుతూ.. ఆయన అంచనాలకు దగ్గరగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆప్షన్-ఏ కింద తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా వేసిన అన్నామలై.. ఆప్షన్-బి కింద బీజేపీ గనుక వచ్చే రెండేళ్లపాటు శ్రమించి క్షేత్రస్థాయిలో నాయకులను తీర్చిదిద్దితే.. 500 రోజుల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తే.. 2026లో ప్రజలు తమవైపు మొగ్గు చూపుతారని ఆయన అంచనా వేశారు.బీజేపీ పెద్ద రిస్క్ తీసుకొని.. ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి రావడానికి 500 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే.. తమిళనాడులో బీజేపీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నామలై 2024లోనే వ్యాఖ్యానించారు.అన్నామలై చెప్పినట్లు 2026 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా లేదా.. 2024 ఎన్నికల తరహాలోనే చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసి 5-6 సీట్లు గెలుచుకున్నా సరే.. ఇప్పుడు తమిళనాడు ముఖచిత్రం మరోలా ఉండేదని చెప్పొచ్చు. ఒకవేళ ఒక్క సీటు గెలవలేకపోయినా సరే, 10 శాతానికి అటు ఇటుగా ఓట్లు సాధిస్తే మరుసటి ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా ఉండేది. అయితే బీజేపీ అధినాయకత్వం ఆయన మాటలను పరిగణనలోకి తీసుకోలేదు. అన్నాడీఎంకేతో పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఈపీఎస్ డిమాండ్‌తో అన్నామలైను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక.. జాతీయ పార్టీ అయిన బీజేపీకి కొన్ని సమస్యలు కూడా ఉంటాయని అన్నామలైకు తెలుసు. తమిళనాడులో ద్రవిడ వాదంతోపాటు బీజేపీ పట్ల వ్యతిరేకత కూడా ఎక్కువే. అందుకే బీజేపీ నాయకుడిగా జనంలోకి వెళ్లడం కంటే.. సొంత పార్టీ పెట్టుకుని జాతీయవాద దృష్టి, లౌకిక భావనలతో ముందుకెళ్తే తనకు సొంతంగానే ఎదిగే అవకాశం ఉందని అన్నామలై భావించి ఉండొచ్చు. 41 ఏళ్ల తాను మరో పదేళ్లు కష్టపడితే పార్టీని అధికారంలోకి తీసుకురావడం కష్టం కాదనే అంచనాతోనే ఆయన సొంత పార్టీవైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డీఎంకేను దెబ్బతీసి విజయ్ నాయకత్వంలోని టీవీకే అధికారంలోకి రాగా.. మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేను అన్నామలై దెబ్బకొట్టే అవకాశం ఉంది.