భారత్‌‌పై మరో 12.5 శాతం సుంకాలకు ట్రంప్ ప్రతిపాదన.. ఇదేం ‘లేబర్’ యవ్వారం!

Wait 5 sec.

Trump Tariffs: భారత్‌కు మరోసారి ఊహించని షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా 60 వరకు దేశాలపై వెట్టిచాకిరి (Forced Labour) నిర్మూలనలో విఫలమైనందుకు గానూ ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) ప్రతిపాదించింది. భారత్‌తో పాటు చైనా, జపాన్ సహా మొత్తం 60 దేశాలపై ఈ అదనపు సుంకాలు విధించనున్నారు. ఇందులో అత్యధికంగా 12.5 శాతం సుంకాలు విధిస్తుండగా కొన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించారు.' వెట్టి చాకిరి చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులపై నిషేధం విధించడం, వాటిని అమలు చేయడంలో పలు దేశాలు విఫలమైనట్లు తేలింది. మా వాణిజ్య భాగస్వామ్య దేశాలు సైతం ఈ ఫోర్స్‌డ్ లేబర్‌ని అరికట్టలేకపోవడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదు. వెట్టి చాకిరీ కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. అసమానతలను మేము సహించలేం.' అని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గ్రీర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి మొత్తం 60 దేశాలపై దర్యాప్తు జరిపినట్లు వెల్లడించారు. దర్యాప్తు తర్వాత మొత్తం 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. 12.5 శాతం అదనపు సుంకాలు విధించాలన్న దేశాల జాబితాలో భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూకే వంటి తదితర దేశాలు ఉన్నాయి. ఇక కెనడా, ఈయూ, ఈక్వెడార్, మెక్సికో, ఇండోనేసియా, పాకిస్థాన్ దేశాలు నిషేధం విధించినా వాటిని సమర్థవతంగా అమలు చేయలేకపోయాయని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఆరోపించింది. అందుకే ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ సుంకాలపై చర్చించేందుకు ఆయా దేశాలు జూన్ 22లోగా తమను సంప్రదించవచ్చని సూచించింది. ఖండించిన భారత్ఇలాంటి అంశాలను ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపి వేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ విభాగానికి చెందిన అధికారులు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. చీఫ్ నెగేషియేటర్ బ్రెండన్ లించ్ ఆధ్వర్యంలోని ఈ ట్రేడ్ టీమ్ భారత్‌తో వాణిజ్య చర్చలు చేపట్టేందుకు ఢిల్లీకి వచ్చింది. ఇరు దశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు చేపడుతున్నారు. ఇలా అమెరికా బృందం భారత్‌లో ఉండగానే ట్రంప్ కొత్త సుంకాలకు ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.