IPL 2026 అవార్డులన్నీ వైభవ్ సూర్యవంశీకే.. బుడ్డోడికే బ్యాటింగ్ రివార్డులు!

Wait 5 sec.

యూనివర్శల్ బేబీ బాస్‌గా పేరొందిన వండర్ కిడ్ ఐపీఎల్ 2026లో పెను విధ్వంసం సృష్టించాడు. 2025లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ బాది ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి ఇండియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది కూడా సిక్సర్ల మోత మోగించి రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2026 బ్యాటింగ్ అవార్డులన్నీ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్‌లో 97, 96 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్వాలిఫయర్ 2లో గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌కి లెజెండ్రీ క్రికెటర్లంతా ఫిదా అయ్యారు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఆడాడంటూ ఆశ్చర్యపోయారు. 63 ఫోర్లతో పాటు 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును ఊదేశాడు. ఐపీఎల్ 2026 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌తో పాటు అన్ని బ్యాటింగ్ అవార్డులన్నీ వైభవ్‌కే దక్కాయి. ఒక్క మోస్ట్ ఫోర్స్ మినహా మిగతా అన్నీ కూడా వైభవ్ ఖాతాలోనే చేరాయి. అత్యధిక ఫోర్ల లిస్ట్‌లో మాత్రం గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చొని అవార్డు అందుకున్నాడు. వైభవ్‌కు వచ్చిన అవార్డులువైభవ్ సూర్యవంశీ సొంతం చేసుకున్న అవార్డుల జాబితా ఇదే. 436.5 పాయింట్స్‌తో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. భవిష్యత్తులో కూడా ఎవ్వరూ సాహసించలేని విధంగా 72 సిక్సర్లతో సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు. 237.31 స్ట్రయిక్ రేట్‌తో సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు. అదేవిధంగా చివరిదైన ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కడం విశేషం. బ్యాటింగ్ విభాగంలో ఒక్క ఫోర్స్ మినహా మిగతా అన్నీ వైభవ్ సూర్యవంశీనే సొంతం చేసుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పర్పుల్ క్యాప్‌ను 29 వికెట్లతో కగిసో రబడా సొంతం చేసుకున్నాడు. ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా మొహమ్మద్ సిరాజ్ (172) నిలిచాడు. ఫెయిర్ ప్లే అవార్డును పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ మనీష్ పాండే సొంతం చేసుకున్నాడు.