రూ.25 లక్షల ప్యాకేజీ జాబ్ వదిలేసి.. ఓలా డ్రైవర్‌గా MBA గ్రాడ్యుయేట్.. 3 ఏళ్లలో మైండ్ బ్లాక్!

Wait 5 sec.

MBA Graduate: రూ. 25 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. నెలకు లక్ష రూపాయలు చేతికి వస్తే ఆ లగ్జరీనే వేరు. అందుకోసం ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తుంటారు. కానీ, ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించి ఎవరూ తెలిసిన వాళ్లు, బంధువులు చదివిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరైంది అంటూ ఎగతాళి చేసినా వెనకడుగు వేయలేదు. అనుకున్న లక్ష్యం వైపు కలిలాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత అతను సాధించిన విజయం చూసి నాడు ఎగతాళి చేసిన వాళ్లే నేడు మావాడు తోపు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. శశి సచన్ అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా తన సోదరుడి లైఫ్ జర్నీ గురించి పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. ఏం జరిగిందంటే?టైర్-2 కాలేజీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత రూ. 25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ వచ్చింది. అయితే ల్యాప్‌టాప్ ముందు కూర్చునేందుకు ఇష్టపడని సదరు యువకుడు, స్వతంత్రంగా బతకాలన్న ఆలోచనతో ఓలా క్యాబ్ నడపడం మొదలు పెట్టాడు. 'ఉద్యోగం మానేసి డ్రైవర్ అవుతావా అంటూ బంధువులు, ఇరుగు పొరుగు వారు విమర్శించారు. అంత చదువు చదివి కార్లు కడగాలా అంటూ హేళన చేశారు' అని శశి సచన్ గుర్తు చేసుకున్నారు.అయితే, వ్యాపారంగా మార్చుకున్నాడని శశి చెప్పారు. పట్టుదలగా శ్రమిస్తూ, ఒక్కో కారును కొనుగోలు చేస్తూ 3 సంవత్సరాల్లో 5 కార్ల ఫ్లీట్‌ను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ 5 కార్లను ఓలా ప్లాట్‌ఫామ్‌ ద్వారా రెంటుకు తిప్పుతూ నెలకు దాదాపు రూ. 1.5 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నాడని శశి రాసుకొచ్చారు. కేవలం వైట్ కాలర్ ఉద్యోగాలు మాత్రమే సక్సెస్‌కు కొలమానం కాదని, వ్యాపార ఆలోచన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించినట్లు చెప్పాడు.భిన్నాభిప్రాయాలుఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు అతని ధైర్యాన్ని, వ్యాపార దృక్పథాన్ని అభినందించారు. మరి కొందరు కార్పొరేట్ రంగంలోనే ఉండి ఉంటే కొన్నేళ్ల తర్వాత ఇంతకంటే ఎక్కువ ప్యాకేజీ వచ్చేదని పేర్కొన్నారు. 'విజయం అనేది కేవలం జీతం అంకెల్లో ఉండదు, చేసే పనిలోని సంతోషంలో ఉంటుంది. కార్పొరేట్ ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ తనకంటూ సొంత బిజినెస్ మోడల్ క్రియేట్ చేసుకోవడం ఈ తరం యువతకు కొత్త స్ఫూర్తినందిస్తుంది' పలువురు చెబుతున్నారు.