కష్టకాలంలో కళ్లు చెదిరే ఆఫర్.. బేసిక్ శాలరీనే రూ.3.71 కోట్లు.. హెచ్-1బీ నియామకాల్లో ఎన్‌విడియా సంచలనం!

Wait 5 sec.

Nvidia Hiring: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు వేల సంఖ్య ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లడం, వ్యయ నియంత్రణ చర్యల వంటి వాటితో భారీ లేఆఫ్స్ చేస్తూ కొత్త నియామకాలు- విదేశీయులకు వీసా స్పాన్సర్‌షిప్‌లను తగ్గిస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ టెక్ మార్కెట్లో మందగమనం కొనసాగుతున్న తరుణంలో అమెరికా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ద్వారా విదేశాలకు చెందిన టెక్, ఐటీ ఉద్యోగులను భారీ వేతన ప్యాకేజీలతో ఆకర్షిస్తోంది. ఫెడరల్ ఫైలింగ్స్ ప్రకారం.. 2026లో ఇప్పటి వరకు దాదాపు 1200 హెచ్- 1బీ పొజిషన్లకు ఎన్విడియా సర్టిఫికేషన్ పొందింది. 2025లో ఇదే సమయానికి చూసుకుంటే అది 1000గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు, ఎన్‌విడియా చిప్‌లతో నడిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, రీసెర్చ్ విభాగాల్లో స్పెషలైజ్డ్ ఇంజినీర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఎన్‌విడియా భారీ స్థాయిలో నియామకాలు చేపడుతోంది. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తోంది. కనీస వేతనమే కోట్లలోకంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉన్న వారికి మూల వేతనం ఏకంగా 4.88 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ.4.64 కోట్ల వేతనం ఉంది. ప్రిన్సిపల్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డిస్టింగ్విష్డ్ ఏఐ ఆల్గారిథమ్ ఇంజినీర్ల వార్షిక వేతనాలు 4 లక్షల డాలర్లను మించాయి. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కనీస వేతన 3,91,000 డాలర్లు (రూ.3.71 కోట్లు), ప్రోడక్ట్ మేనేజర్ కనీస వేతనం 3,79,500 డాలర్లు (రూ.3.60 కోట్లు), హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్ కనీస వేతనం 3,68,000 డాలర్లు (రూ.3.49 కోట్లు), రీసెర్చ్ సైంటిస్ట్ కనీస వేతనం 3,56,500 డాలర్లు (రూ.3.39 కోట్లు)గా ఆఫర్ చేస్తోంది. వెనకబడిన గూగుల్, అమెజాన్గూగుల్ గత సంవత్సరం తొలి 5 నెలల్లో ఆమోదించిన హెచ్-1 బీ నియామకాల సంఖ్య 5100 గా ఉండగా ఈసారి అదే సమయంలో 2,200లకు పడిపోయింది. అమెజాన్ వీసా అప్రూవల్స్ 6100 నుంచి 4300 స్థాయికి పడిపోయింది. వలస విధానాలపై ప్రభుత్వ అనిశ్చితి, వ్యయ నియంత్రణల కారణంగా ప్రధాన ఐటీ కంపెనీలు విదేశీ నియామకాలను భారీగా తగ్గించుకుంటున్నాయి. ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై లక్ష డాలర్లు అంటే దాదాపు రూ.95 లక్షల భారీ రుసుము విధిస్తోంది. అయితే ఎన్‌విడియా ఆ ఖర్చులను భరిస్తూ వీసా స్పాన్సర్ షిప్‌లను కొనసాగిస్తోందని కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ తెలిపారు. అమెరికాలో ఎంఎస్ చేసిన వారికి, లక్ష డాలర్ల వీసా రుసుం నుంచి మినహాయింపు ఉంటుంది.