ఐపీఎల్‌లో టిమ్ డేవిడ్ సస్పెండ్.. అంపైర్‌పై ఐస్ బ్యాగ్ విసిరిన హిట్టర్!

Wait 5 sec.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ జట్టులో కీలక హిట్టర్ అయిన టిమ్ డేవిడ్‌కు భారీ షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించడమే టిమ్ డేవిడ్ సస్పెన్షన్‌కు కారణమైంది. డేవిడ్ కూడా తప్పు అంగీకరించడంతో నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ సమయంలో పదో ఓవర్‌ ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్ గాల్లోకి బంతిని లేపగా.. బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. తొలుత అవుట్‌గా ప్రకటించినా.. అంపైర్ రీ ప్లే చూడాలని థర్డ్ అంపైర్‌కి సజ్జెస్ట్ చేశాడు. అయితే బంతి నేలను తాకుతున్నట్లు చూయించడంతో నాటౌట్‌గా ప్రకటించారు. గతంలో ఇలాంటి క్యాచ్‌నే హోల్డర్ పట్టుకుంటే అవుటిచ్చారని, ఇప్పుడు నాటౌట్ ఎలా ఇస్తారంటూ కెప్టెన్ రజత్ పటిదార్ ప్రశ్నించారు. ఈ క్రమంలో అసహనానికి గురైన టిమ్ డేవిడ్ తీవ్ర ఆగ్రహంతో అంపైర్ నితిన్ మీనన్ దిశగా ఐస్ బ్యాగ్ విసిరాడు. మ్యాచ్ అధికారులు ఈ ఘటనను గుర్తించి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు తేల్చారు. దాంతో టిమ్ డేవిడ్ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కూడా నమోదు చేశారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ప్రకారం ఆటగాళ్లు లేదా మ్యాచ్ అధికారుల వైపు ప్రమాదకరంగా వస్తువులు విసరడం నేరం. ఈ తప్పును టిమ్ డేవిడ్‌ కూడా అంగీకరించి మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన శిక్షను స్వీకరించాడు. 50 శాతం జరిమానా, రెండు డీ మెరిట్ పాయింట్లు వచ్చాయి. అయితే, ఈ సీజన్‌లో ఇది టిమ్ డేవిడ్ మూడో లెవల్ -1 నేరం కావడంతో మొత్తం ఐదు డీ మెరిట్ పాయింట్లతో ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. దాని ప్రకారం ఐపీఎల్ 2027లో ఆర్సీబీ ఆడే ఆరంభ మ్యాచ్‌కి టిమ్ డేవిడ్ దూరమవ్వనున్నాడు.