RCB vs GT ఫైనల్‌లో హైడ్రామా.. ఔటిచ్చినా కదలని కోహ్లి.. అంపైర్‌తో గొడవ, గిల్‌తో గ్రౌండ్‌లోనే డిస్కషన్!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో హై డ్రామా నెలకొంది. ఆర్సీబీ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడిన బంతిని కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ విషయంలో విరాట్ కోహ్లి - శుభ్‌మన్ గిల్ - అంపైర్ల మధ్య కాసేపు హై డ్రామా నెలకొంది. క్యాచ్ విషయంలో కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్‌లో కొంత ఉత్కంఠభరిత క్షణాలు కనిపించాయి. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ పూర్తిగా పట్టలేదని.. బంతి నేలను తాకిందని కోహ్లి భావించాడు. అయితే, కోహ్లి ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తో వాగ్వాదానికి దిగాడు. తొలుత అంపైర్ కోహ్లిని పెవిలియన్‌కు వెళ్లాలని సూచించినా.. కోహ్లి రివ్యూకి వెళ్లాలని పట్టుబట్టడంతో చేసేదేం లేక నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు పంపిచారు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ డెసిషన్ తనకు అనుకూలంగా రావడంతో కోహ్లి గ్రౌండ్‌లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వివాదం జరిగే సమయానికి కోహ్లి 63 పరుగులు చేశాడు. కీలక మ్యాచ్‌లో మరోసారి ఛేజ్ మాస్టర్ అనిపించుకున్న విరాట్ కోహ్లి ఆఖరి వరకు క్రీజులో కొనసాగి 42 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 156 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఓవర్లలోనే ఛేదించింది. ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకుని గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేశాడు. ఆరంభంలోనే గిల్, సాయి, బట్లర్ అవుటవ్వడంతో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 155/8 పరుగులు చేసింది. కోహ్లి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 18 ఓవర్లలో 161/5 చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2025లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే జోష్ కనిపించి టైటిల్ అందుకుంది. గతేడాది తొక్కిసలాటలో మరణించిన అభిమానులకు ఈ విజయాన్ని అంకితం చేశాడు కెప్టెన్ రజత్ పటిదార్.