Amara Raja: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీ మాజీ ఎంపీ, దిగ్గజ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌కు చెందిన బ్యాటరీ తయారీ కంపెనీ లిమిటెడ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎక్సైడ్ బ్యాటరీల రెడ్, వైట్ డ్రెస్‌కోడ్‌ను పోలినట్లుగా ఉండే అమరరాజా ఎలిటో బ్యాటరీస్ ప్యాకేజ్ అనేది ట్రేడ్ మార్క్ రూల్స్ ఉల్లంఘన కిందకు వస్తుందని, వాటి విక్రయాలను ఆపేయాలని కోరుతూ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లింది. ఈ కేసులో కోల్‌కతా హైకోర్టు ఏప్రిల్ 2వ తేదీన జారీ చేసిన ఇంజక్షన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌, జస్టిస్ నాగరత్నలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సవరించింది.అప్పీల్‌పై విచారించిన ఈ ధర్మాసనం కంపెనీ వద్ద మిగిలి ఉన్న 20,789 బ్యాటరీలను ఎరుపు రంగు బ్యాంకుల్లో కాకుండా ఇతర రంగు బాక్సుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు అంగీకారం తెలిపింది. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి రిటెయిలర్లు, డిస్ట్రిబ్యూటర్ల, ఫ్రాంచైజీల వద్దకు చేరిన ఇలాంటి 1.38 లక్షల యూనిట్ల బ్యాటరీలను యథాతథంగా అమ్ముకునేందుకు ఓకే చెప్పింది. అయితే, ఇలాంటి బ్యాటరీల ప్యాకేజీ కోసం ఇప్పటికే సిద్ధం చేసిన 1,44,547 ఎర్ర రంగు ఖాళీ బాక్సులను ధ్వంసం చేయాలని స్పష్టం చేసింది. వాటిని ఉపయోగించకూడదని అమర రాజా కంపెనీకి ఆదేశాలు ఇస్తూ అప్పీల్ పై విచారణను ముగించింది.క్యూ4లో అదరగొట్టిన కంపెనీ ఇటీవలే ప్రకటించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.314.3 కోట్లుగా నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.161.60 కోట్లుగా ఉంది. అంటే ఈసారి ఏకంగా 95 శాతం మేర లాభం పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 15.5 శాతం పెరిగి రూ.3535.80 కోట్లుగా నమోదు చేసింది. ఏడాది కిందట ఇదే టైంలో కంపెనీ ఆదాయం రూ.3060.10 కోట్లుగా ఉంది. ఎబిటా 13.1 శాతం పెరిగి రూ.385.50 కోట్లకు చేరింది. ఈ క్రమంలో అమర రాజా ఎనర్జా అండ్ మొబిలిటీ షేర్లు జూన్ 1వ తేదీ సోమవారం రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఫోకల్‌లో ఉండనున్నాయి. క్యూ4లో మంచి ఆదాయాలు, లాభాలు అందుకోవడం, సుప్రీం కోర్టులో ఊరట లభించడంతో ఈ షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.