IPO Calendar: భారతీయ ప్రైమరీ మార్కెట్లోకి మెయిన్ బోర్డు సెగ్మెంట్ నుంచి ఈ వారం రెండు కంపెనీలు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్న ఈ తరుణంలో రెండు కంపెనీలు ఐపీఓలకు వస్తుండడం గమనార్హం. ఈ వారం మెయిన్ బోర్డు నుంచి (ఐపీఓ)కు వస్తున్న కంపెనీల్లో సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ (CMR Green Technologies Ltd) ఉండగా మరొకటి హెగ్జాగాన్ న్యూట్రిషియన్ లిమిటెడ్ (Hexagon Nutrition Ltd) ఉన్నాయి. లక్ష్యంతో ఐపీఓకు వస్తున్నాయి. ఈ రెండు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్ వివరాలు తెలుసుకుందాం.2026 సంవత్సరం నిస్తేజంగా ఉండనున్న తరుణంలో ఐపీఓ మార్కెట్ కొన్ని వారాలుగా స్తబ్దుగా ఉన్న సమయంలో ఈ రెండు కంపెనీలు పబ్లిక్ ఆఫర్లకు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం పొందినప్పటికీ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులతో తమ ఐపీఓ ప్లాన్స్‌ను వాయిదా వేసుకున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ రెండు కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు ముందడుగు వేయడం గమనార్హం.జూన్ 3 నుంచే షురూఈ కంపెనీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జూన్ 3, 2026 రోజున మొదలవుతోంది. రెండు రోజుల పాటు అంటే జూన్ 5, 2026 వరకు ఈ సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర (ప్రైస్ బ్యాండ్) రూ.182-196 గా నిర్ణయించారు. ఇష్యూ గరిష్ఠ ధర వద్ద రూ.630.90 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుగింది. ఈక్వైరస్ క్యాపిటల్ ఈ పబ్లిక్ ఆఫర్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా మెటల్ రీసైక్లింగ్, సర్క్యూలర్ ఎకనామి సెగ్మెంట్, రిసైకిల్ చేసిన అల్యూమినియం, జింక్ ఉత్పత్తులను ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్ల కోసం తయారు చేస్తుంది. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఈ సంస్థకు క్లయింట్లుగా ఉన్నాయి. జూన్ 5 నుంచి హెగ్జాగాన్ సబ్‌స్క్రిప్షన్ఈ వారం మార్కెట్లోకి వస్తున్న రెండో మెయిన్‌బోర్డ్ ఇష్యూ హెగ్జాగాన్ న్యూట్రిషియన్. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జూన్ 5వ తేదీన మొదలై జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.42- రూ.45గా నిర్ణయించింది. 3.09 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ.138.90 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే నిర్వహిస్తోంది. అంటే ప్రమోటర్లు తమ వాటాను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి వెళ్లవు.