ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో ఆటతీరుకు అందరూ ఫిదా అయ్యారు. కేవలం హిట్టింగే కాకుండా ఒక బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేసి జట్టును ఎలా ఆదుకోవాలో కూడా వైభవ్ సూర్యవంశీ నిరూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి బాడీ అటాకింగ్ బౌలింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా సమర్థించుకున్నాడు. 15 ఏళ్ల వైభవ్‌ను అడ్డుకునేందుకు బాడీ అటాకింగ్ బౌలింగ్ చేయడం తనకు నచ్చలేదని చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. రబడా వేసిన బంతి వైభవ్ హెల్మెట్‌కి తాకడంతో ఫిలిప్ హ్యూస్ గుర్తొచ్చాడని ఎమోషనల్ అయ్యాడు. ఒక తండ్రిగా దానిని తాను సమర్థించలేకపోతున్నానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా చేశాడు. "15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపేందుకు బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అతడు పెద్ద ఆటగాళ్లతో ఆడుతున్నాడని నాకూ తెలుసు. కానీ ఒక తండ్రిగా అది నాకు నచ్చలేదు. వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నా కొడుకు ఆడుతున్నట్లు అనిపిస్తోంది. అతడి తలకు బంతి తగలడంతో నాకు ఆందోళన కలిగింది. వెంటనే ఫిలిప్ హ్యూస్ గుర్తొచ్చాడు. వైభవ్ ఈ స్థాయిలో ఆడుతుంటే ఇలాంటి సవాళ్లే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్టు అతడిపై వ్యూహాలు రచిస్తాయి. అందులో తప్పేమీ లేదు. కానీ ఒక తండ్రిగా నాకు అది నచ్చలేదు. వండర్ కిడ్ వైభవ్‌కి మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ 2014లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్‌లోనే కన్నుమూశాడు. సీన్ అబాట్ వేసిన బౌన్సర్ ఫిలిప్ హ్యూస్ తలకు తలగడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. హాస్పిటల్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రపంచ క్రికెట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఐపీఎల్‌లో రబడా వేసిన బంతి కూడా వైభవ్ తలకు తగలడంతో ఇర్ఫాన్‌కు ఫిలిప్ హ్యూస్ ఘటన గుర్తొచ్చింది. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ తన సత్తా చాటాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్‌లో వరుసగా 96, 97 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో మొత్తం ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 776 పరుగులు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మొహమ్మద్ సిరాజ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా ఉతికారేశాడు. ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్ భవిష్యత్ క్రికెట్‌గా మారాడు.