ఆ కారణంతో 'డీజిల్' ధరలు తగ్గింపు.. కేంద్రం వద్దకు ప్రతిపాదన.. ఈరోజు లీటర్ ఎంతుందంటే?

Wait 5 sec.

Diesel Price: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశీయంగా డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. డీజిల్ ధరలను తగ్గించడం ద్వారా దేశీయంగా రవాణా రంగానికి ఉపశమనం కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) విజ్ఞప్తి చేసింది. అధిక ఇంధన ధరలు ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని, జాతీయ అధ్యక్షుడు హరీష్ సబర్వాల్ తెలిపారు. దేశంలో వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులో సుమారు 60 శాతం వరకు డీజిల్‌ ఖర్చులు ఉంటాయి. దీంతో అధిక ఇంధన ధరల కారణంగా లారీలు, ట్రక్కులు, చిన్న వాణిజ్య వాహనాల యజమానులు, డ్రైవర్లు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఏఐఎంటీసీ ప్రెసిడెంట్ హరీష్ సబర్వాల్ తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకూ దారితీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ సహా ఇతర ఇంధనల కన్నా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో రవాణా వ్యయాలు భారీగా పెరిగి ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలుపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను రెండు వారాల వ్యవధిలోనే నాలుగుసార్లు పెంచారు. దీంతో రవాణా వ్యయాలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం నిత్యావసర సరకుల నుంచి ఇతర ఉత్పత్తుల ధరలపైన చూపించింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 115.73 వద్ద ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 103.82 వద్ద ఉన్నాయి. ఇక ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.102.12 వద్ద ఉంది. డీజిల్ లీటర్ ధర రూ.95.20 వద్ద ఉంది. ఇక ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21 వద్ద ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.83 వద్ద ఉన్నాయి.