సీనియర్ సిటిజన్లూ.. మీరు ITR-1,2,3,4 ఫామ్స్‌లో ఏది ఎంచుకోవాలి? ఎవరు ఫైల్ చేయక్కర్లేదు!

Wait 5 sec.

Senior Citizens: అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించిన ఆన్‌లైన్ ఐటీ రిటర్నుల (ITR) ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. మే 27వ తేదీన ఐటీఆర్-2 ఆన్‌లైన్ ఫైలింగ్ సందుపాయాన్ని కూడా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో యాక్టివేట్ చేసింది. ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఏ ఐటీఆర్ ఫామ్ ఎంచుకోవాలనేది పెద్ద సవాలుగా మారింది. తప్పుడు ఫామ్ ఎంచుకుంటే నోటీసులు రావడం లేదా రీఫండ్ ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు సరైన ఫామ్ ఎలా ఎంచుకోవాలి, ఎవరికి మినహాయింపు ఉంటుంది? అనే వివరాలు తెలుసుకుందాం. ఆదాయం ఆధారంగా ఫామ్ ఎంపికఅసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి పన్ను చెల్లింపుదారుల వయస్సు ఆధారంగా కాకుండా వారి ఆదాయ వనరుల ఆధారంగానే సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్-1 (సహజ్): పెన్షన్, గరిష్టంగా రెండు ఇళ్ల ద్వారా వచ్చే ఆదాయం, రూ.50 లక్షల లోపు వడ్డీ ఆదాయం ఉన్న వారు ఐటీఆర్-1 ఫామ్ ఉపయోగించవచ్చు. ఐటీఆర్-2: ఒక వేళ మూలధన లాభాలు సంపాదించినా లేదా రెండు కంటే ఎక్కువ ఇళ్ల ఆదాయం వస్తున్నా ఐటీఆర్-2 ఫైల్ చేయవచ్చు. ఐటీఆర్-3: వ్యాపారం లేదా ఏదైనా వృత్తి ద్వారా నేరుగా ఆదాయం పొందేవారు ఐటీఆర్-3 ఫైల్ చేయాలి. అయితే ప్రస్తుతం ఐటీఆర్-3 ఫామ్ ఆన్‌లైన్లో ఇంకా యాక్టివేట్ కాలేదు. దీని కోసం ట్యాక్స్ పేయర్లు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఐటీఆర్-4 (సుగమ్): ప్రిజంప్టివ్ టాక్సేషన్ పరిధిలోకి వచ్చే వారు ఈ ఫామ్ ఎంచుకోవాలి.ఐటీఆర్ ఫైలింగ్ నుంచి ఎవరికి మినహాయింపు ఉంటుంది? ప్రయోజనాలు, మినహాయింపులు లభిస్తాయి. కొత్తగా ప్రవేశపెట్టిన, విస్తరించిన ద్వారా వారు ఐటీఆర్ ఫైలింగ్ నుంచి పూర్తిగా మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం నిర్దేశిత సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ దాఖలు చేయకుండా మినహాయింపు పొందేందుకు ఇచ్చే ఒక తప్పనిసరి డిక్లరేషన్ ఈ ఫామ్ 125. గతంలో దీనిని ఫామ్ 12బీబీఏగా పిలిచేవారు. భారత దేశంలో నివసిస్తూ 75 సంవ త్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అర్హులు. అయితే, వీరికి కేవలం పెన్షన్, ఏ బ్యాంకులోనైతే ఈ డిక్లరేషన్ ఇస్తున్నారో అదే బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ ఆదాయం మాత్రమే ఉండాలి. అద్దె ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ లేదా వ్యాపార ఆదాయం ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.