తమిళనాడు సీఎం విజయ్ తొలి పర్యటన.. తిరుచ్చిలో మొట్టమొదటి బహిరంగ సభ

Wait 5 sec.

.. తన తొలి పర్యటనకు రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌లలో తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. అయితే ఈ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం అక్కడ పర్యటించనున్నారు. సోమవారం రోజున తిరుచ్చిలో బహిరంగ సభ నిర్వహించేందుకు టీవీకే నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎన్నో హైడ్రామాల మధ్య తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. పొత్తులు, మంత్రివర్గాన్ని విస్తరించడం.. ఎన్నికల వేళ ప్రజలకు వాగ్దానాలను అమలు చేయడం.. ఢిల్లీలో పర్యటించడం.. వంటి పనులతో విజయ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అత్యవసర పనులన్నీ విజయవంతంగా ముగించుకున్న విజయ్‌.. ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు విజయ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంగా బాధ్యలు చేపట్టిన తర్వాత విజయ్‌ ప్రజల్లోకి తొలిసారిగా వస్తుండటంతో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇక చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో విజయ్‌ చేరుకోనున్నారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ నుంచి తన సొంత ఓపెన్ వ్యాన్‌లో విజయ్ బయలుదేరనున్నారు. తిరుచ్చి-పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్‌ టోల్‌ గేట్ మీదుగా.. ఓల్డ్‌ డెయిరీ ఫామ్‌, మిల్క్‌ స్టేషన్‌ నుంచి సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు. ఓపెన్‌ వ్యాన్‌లో ముఖ్యమంత్రి విజయ్ నిలబడి ప్రజలకు, టీవీకే కార్యకర్తలకు అభివాదం చేస్తూ.. చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ ప్రయాణించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ తిరుచ్చి పర్యటనను ముగించిన తర్వాత సీఎం విజయ్.. తమిళనాడులోని ఇతర జిల్లాల్లో కూడా పర్యటించి.. టీవీకే పార్టీకి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.