Petrol Price: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చింది. రెండు వారాల్లోనే నాలుగు సార్లు ధరలు పెంచారు. అలాగే విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఇంధనపై విండ్‌ఫాల్ ట్యాక్స్ మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఇందన కొరతను తగ్గించేందుకు విండ్ ఫాల్ ట్యాక్స్ భారీగా విధించగా తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశీయ చమురు శుద్ధి కంపెనీలు, ఎగుమతిదారులకు ఊరట లభించినట్లయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీఫికేషన్ ప్రకారం సవరించిన కొత్త పన్ను రేట్లు జూన్ 1, 2026 నుంచే అమలులోకి వస్తాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. సవరించిన కొత్త రేట్ల ప్రకారం పెట్రోల్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైంజ్ సుంకం (SAED)ను లీటరుకు రూ.1.50 మేర తగ్గించారు. అలాగే డీజిల్ ఎగుమతులపై విధించే విండ్ ఫాల్ ట్యాక్స్ లీటరుకు రూ.13.50గా నిర్ణయించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై లీటరుకు రూ.9.50గా నిర్ణయించారు. మరోవైపు దేశీయ మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విండ్ ఫాల్ ట్యాక్స్ రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చనున్నట్లు తెలిపింది., ఉత్పత్తిదారుల ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును విధించింది. పెట్రోల్, డీజిల్, దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై సుంకాలను ప్రకటించింది. ప్రైవేట్ శుద్ధి కర్మాగారాలు స్థానికంగా విక్రయించడానికి బదులుగా, అధిక శుద్ధి మార్జిన్‌లను సద్వినియోగం చేసుకోవడానికి ఇంధనాన్ని విదేశాలకు విక్రయించాలని చూడటంతో, ప్రభుత్వం తరువాత పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ (ATF) ఎగుమతులపై కూడా ఈ సుంకాన్ని పొడిగించింది.లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలుహైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.73, లీటర్ డీజిల్ ధర రూ. 103.82. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.102.12, డీజిల్ లీటర్ ధర రూ.95.20 . ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21, లీటర్ డీజిల్ ధర రూ.97.83.