నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. వైసీపీ కార్యకర్త పనేనన్న లోకేష్.. ఆమరణ దీక్షకు దిగుతానన్న షర్మిల

Wait 5 sec.

నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి.. తలభాగాన్ని విగ్రహం నుంచి వేరుచేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు సైతం రంగంలోకి దిగారు, ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. జంబులయ్యను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో ఈ పనిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వైసీపీ కార్యకర్త పనేనన్న లోకేష్మరోవైపు వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. వైసీపీ కార్యకర్త పనేనని మంత్రి విమర్శించారు. జంబులయ్య వైసీపీ నేతల అనుచరుడంటూ ఓ ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదని మండిపడ్డారు. జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారని ఆరోపించారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య వైసిపి నేతల అనుచరుడని పోలీసులు తేల్చారన్న లోకేష్.. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా అని ప్రశ్నించారు.రాజకీయ కక్షకు నిదర్శనం.. వైఎస్ షర్మిలమరోవైపు వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అత్యంత దారుణమని ఏపీసీసీ చీఫ్ అన్నారు. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ కక్షకు ఇది నిదర్శనమని షర్మిల ఆరోపించారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్యగా విమర్శించారు.మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని , సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీసు యంత్రాంగానికి తగదని షర్మిల సూచించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలని.. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలన్న షర్మిల.. వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.