రెండు నెలల పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించిన ఇక ముగిసింది. ఈ రెండు నెలల్లో ఎన్నో అనుభవాలు.. ఫ్యాన్ వార్స్.. ఫ్రస్టేషన్స్.. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రేక్షకుల కోసం టెస్టు క్రికెట్ గేట్లు తెరిచింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం సాగే ఈ టెస్టు క్రికెట్‌లో అన్ని దేశాలు పోటాపోటీగా తలపడుతున్నాయి.ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లు ఈ రెండు నెలల పాటు భారీ సిరీస్‌లకు దూరమయ్యాయి. ఒక్క పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మాత్రమే టెస్టు సిరీస్ ఆడింది. ఐపీఎల్ ముగియడంతో మళ్లీ టెస్టు సిరీస్‌లు ప్రారంభమవుతున్నాయి. టీమిండియా, అప్ఘనిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి.ఈ వారంలో టెస్టు సిరీస్‌లు మళ్లీ మొదలవ్వనున్నాయి. ఇంగ్లండ్ - న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు వీక్ మొదలవ్వనుంది. దీంతో పాటు భారత్ - అప్ఘనిస్థాన్ జట్లు కూడా ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇంగ్లండ్ - న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జరగనుండగా.. జూన్ 17 నుంచి మొదలయ్యే రెండో టెస్టు ఒవెల్ వేదికగా జరగనుంది. మూడో టెస్టు జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా సాగనుంది. భారత్ - న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముల్లాన్‌పూర్‌లోని స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ జూన్ 6 నుంచి మొదలవ్వనుంది.వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో భారత్, ఇంగ్లండ్ అట్టడుగు స్థానంలో ఉన్నాయి. డబ్ల్యూటీసీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్ హోరాహోరీగా సాగగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోగా.. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తయింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఏడో స్థానానికి పరిమితమైంది. న్యూజిలాండ్ మాత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది.