కేకేఆర్ వదిలేసింది.. ఆర్సీబీ కొనేసింది.. హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిల్స్ కొట్టిన సాల్ట్, సుయాశ్..!

Wait 5 sec.

ఐపీఎల్‌లో హ్యాట్రిక్ టైటిల్స్ కొట్టిన ఆర్సీబీ ద్వయంవరుసగా మూడో ట్రోఫీ అందుకున్న సాల్ట్, సుయాశ్2024లో కేకేఆర్ తరఫున టైటిల్ ముద్దాడిన ప్లేయర్లుఐపీఎల్ 2026లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదివారం రెండో టైటిల్ ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ ఫీట్ సాధించాయి. అయితే ఇదే సమయంలో ఆర్సీబీకి చెందిన ఇద్దరు ఆటగాళ్లు మరో అరుదైన రికార్డు సాధించారు.ఆర్సీబీ జట్టులో ఉన్న , .. వరుసగా మూడో ఐపీఎల్ టైటిల్ సాధించారు. దీంతో వీరిద్దరూ ఓ అరుదైన క్లబ్‌లో చేరిపోయారు. ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మలు ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడారు. ఆ సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలిచింది. గత సీజన్‌లో ఆర్సీబీ తరఫున వీరిద్దరూ టైటిల్ అందుకున్నారు. ఈసారి కూడా టైటిల్ డిఫెండ్ చేసుకోవడంతో వరుసగా మూడో ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నారు. ఈ జాబితాలో అందరికంటే ముందే ఉన్నాడు.ఐపీఎల్‌లో హ్యాట్రిక్ టైటిల్స్ అందుకున్న తొలి ప్లేయర్ కర్ణ్ శర్మనే. 2016లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతడు ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాడు. తాజాగా ఈ జాబితాలో ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మలు చేరిపోయారు.ఫిల్ సాల్ట్‌, సుయాశ్ శర్మను 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ విడుదల చేసింది. దీంతో ఆర్సీబీ రూ.11.50 కోట్లకు సాల్ట్‌ను, రూ.2.6 కోట్లకు సుయాశ్ శర్మను దక్కించుకుంది. వీరిద్దరూ ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. సాల్ట్ ఐపీఎల్‌లో 40 మ్యాచులలో 175 స్ట్రైక్ రేట్‌తో 1258 పరుగులు చేశాడు. మరోవైపు సుయాశ్ శర్మ.. 39 మ్యాచులలో 27 వికెట్లు పడగొట్టాడు. వచ్చే సీజన్‌లోనూ వీరు ఆర్సీబీ తరఫునే ఆడనున్నారు.