IPL 2026 Final: సమయం లేదు మిత్రమా సమరమే.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్, ఎవరూ గెలిచినా చరిత్రే!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లలో ఏదీ కూడా రెండు టైటిల్స్ సొంతం చేసుకోలేదు. దాంతో ఇవాళ గెలిచిన జట్టు చరిత్రలో నిలవబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచింది. 2002లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్‌గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్‌కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది. ఈ ఐపీఎల్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది. దాంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, నిశాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్ / ఆర్. సాయి కిశోర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనావెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్, జేకబ్ డప్ఫీ, రొమారియో షెఫర్డ్.