RCB vs GT: ఆర్సీబీకి షాకిచ్చేలా గుజరాత్ పెద్ద ప్లాన్.. ఫైనల్ కోసం ఓడిపోయిన పిచ్ సిద్ధం!

Wait 5 sec.

రెండు నెలలు పాటు సాగిన ఐపీఎల్ 2026 సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. లీగ్ స్టేజ్‌లు, ప్లే ఆఫ్స్‌లో నువ్వా నేనా అన్నట్టు తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి. గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి షాకిచ్చేలా పెద్ద ప్లానే రెడీ చేశారు. ఐపీఎల్ 2026‌లో ఈ రెండు జట్లు మొత్తం మూడు మ్యాచ్‌లలో తపడ్డాయి. లీగ్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లలో బెంగళూరు ఆర్సీబీ, అహ్మదాబాద్‌లో గుజరాత్ ఘన విజయాలు సాధించాయి. ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఫైనల్ మాత్రం అహ్మదాబాద్‌లో జరగనుండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. ఫైనల్ మ్యాచ్‌కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాకిచ్చేలా గుజరాత్ పెద్ద ప్లానే సిద్ధం చేసింది. లీగ్ స్టేజ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పిచ్‌నే ఇప్పుడు ఫైనల్‌కీ సిద్ధం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో లీగ్ మ్యాచ్ ఆడిన పిచ్ నెంబర్ 6నే ఫైనల్‌కూ సిద్ధం చేశారు. ఈ పిచ్‌పై ఆర్సీబీ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయింది. అర్షద్ ఖాన్ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, జేసన్ హోల్డర్ రెడు వికెట్లు తీసుకుని మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బౌలింగ్‌కి సహకరించగా.. సెకండ్ బ్యాటింగ్ సమయంలో బ్యాటర్లకు కొంత అనుకూలంగా మారింది. దాంతో గుజరాత్ ఆ మ్యాచ్‌లో 15.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మొత్తానికి ఈ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 వికెట్లు పడ్డాయి. ఆర్సీబీ తరఫున కూడా భువీ మూడు వికెట్లు పడగొట్టగా, షెఫర్డ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఫైనల్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్లో పిచ్ కావడంతో బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిన సమయం. మరి ఈ మ్యాచ్‌లో టాస్ ఏ జట్టును వరిస్తుందో విజయావకాశాలు కూడా వాళ్లకే ఎక్కువగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనావెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్, జేకబ్ డప్ఫీ, రొమారియో షెఫర్డ్, గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, నిశాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్ / సాయి కిశోర్.