: ప్రపంచ వ్యాప్తంంగా భౌగోళికస రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. ఇది భారతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ఈక్విటీతో పాటు స్థిరాదాయ పథకాలతో వైవిధ్యాన్ని పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను కాపాడుకుంటూనే ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని మీరో అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ అధినేత బసంత్ బాఫ్నా ఓ ప్రముఖ మీడియాతో వెల్లడించారు. అంచనా వేశారు. అదే జరిగితే రుణాలు తీసుకున్న వారికి మరికొంత కాలం ఊరట లభించనుంది. మరి ఆయన చెప్పిన విషయాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. గత డిసెంబర్ నాటికి బాండ్ల రాబడులు 6.8 శాతం వద్ద ఉన్నాయని, మార్చి నెలాఖరు నాటికి అది 7.3-7.4 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఏడాది విభాగంలో రాబడి 7.8-7.9 శాతం స్థాయికి చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు మనీమార్కెట్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్లపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు మార్కెట్ కంటే తక్కువ వడ్డీకే రుణాలిచ్చిన బ్యాంకుల వద్ద అదనపు నగదు కరిగిపోయినట్లు చెప్పారు. లోన్ తీసుకున్న వారికి శుభవార్త?ఎల్-నినో ప్రభావం కారణంగా కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో గత 10 ఏళ్లుగా భారత్ మిగులు సాధించింది. చమురు ధరల పెరుగుదల, ప్రతికూల రుతుపవనాల కారణంగా ద్రవ్యోల్బణంపై 40-50 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడవచ్చని, ఇలా జరిగినా ద్రవ్యోల్బణం 5.5 శాతం నుంచి 5.6 శాతంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన లిమిటికి లోబడే ఉన్న కారణంగా వడ్డీ రేట్లను పెంచకవపోవచ్చని బఫ్నా తెలిపారు. వడ్డీ రేట్లను పెంచడానికి బదులుగా ప్రవాస భారతీయల పథకాల ద్వారా విదేశీ నిధులను సమీకరిచడం వట్టి ప్రత్యామ్నాయ మార్గాలను రిజర్వ్ బ్యాంక్ అణ్వేషించాలని చెప్పారు. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లో వడ్డీ రేట్లు, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నందున సిద్ధాంతపరంగా రూపాయి విలువలో పతనం అనేది సహజం. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉంటాయి. దీంతో ఎప్పుడూ కరెన్సీ లోటు ఉంటుంది. దీన్ని భర్తీ చేయడానికి అవసరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. భవిష్యత్తులో విదేశీ పెట్టుబడిదారుల బాండ్లపై విత్ హోల్డింగ్ పన్ను తగ్గించడం లేదా బ్లూమ్ బర్గ్ బార్క్ లేస్ గ్లోబల్ ఇండెక్స్ లో మన దేశాన్ని చేర్చడం వంటివి జరిగినట్లయితే విదేశీ నిధులు తిరిగి మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే జీతం బ్యాంక్ అకౌంట్లో ఉంటే పెద్దగా వడ్డీ రాదు, కానీ అదే డబ్బును 15 రోజుల పాటు లిక్విడ్ ఫండ్లలో పెడితే 6.5 శాతం వడ్డీ పొందవచ్చు. మీరు మూడు నెలల తర్వాత విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. లేదా 7-8 నెలల తర్వాత బీమా ప్రీమియం లాంటివి చెల్లించాలి. అలాంటి సమయంలో ఆ మొత్తాలను ఆ వ్యవధికి సరిపోయే డెట్ ఫండ్లను ఎంచుకోవాలి. దీంతో సుమారు 7.5 శాతం రాబడి పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లను మధ్యలో తీసుకుంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. లిక్విడ్ ఫండ్లలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కావాల్సినప్పుడల్లా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.