: ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఒక సరికొత్త హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత దేశానికి వచ్చే ప్రయాణికులు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి ఇక్కడికి చేరుకునే వారు తప్పనిసరిగా 'ఐసోలేషన్'లో ఉండాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతానికి భారత దేశంలో ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆ ప్రకటనలో స్పష్టమైన హామీ ఇచ్చింది.21 రోజుల నిఘా..కేంద్రం విడుదల చేసిన వివరణాత్మక మార్గదర్శకాల ప్రకారం.. గత 21 రోజులలో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు తమ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించుకోవాలి. ఒకవేళ వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా శరీర భాగాల నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఇతరులకు దూరంగా ఐసోలేట్ కావాలని సూచించింది. ఈ విధమైన లక్షణాలు వ్యక్తమైన వెంటనే స్థానిక ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలని కోరింది.ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం . వైరస్ లక్షణాలను ముందస్తుగా గుర్తించి నివేదించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని, అలాగే దేశంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాలకు ప్రయాణాలను నివారించాలని పౌరులను కోరుతూ ఒక ట్రావెల్ లిస్ట్‌ను కూడా ప్రకటించింది.భారత్‌లో ఎబోలా భయాలు.. గుజరాత్ మంత్రి క్లారిటీ!గడిచిన కొన్ని వారాలుగా భారత్‌లోనూ ఎబోలా వ్యాప్తి చెందుతోందనే ప్రచారాలపై గుజరాత్ ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పాన్‌షేరియా స్పందించారు. కాంగో దేశం నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి .. అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగటివ్ అని తేలిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఆరోగ్య శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఎబోలా పరిస్థితి ఎలా ఉందంటే..?గత నెలలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎబోలా తీవ్రతను గమనించి అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ దేశాలలో ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించగా.. సుమారు 1,077 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. కాంగో సరిహద్దు దేశాలకు ఈ ముప్పు ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. అయితే తాజా బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. కాంగోలో వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన తూర్పు ప్రావిన్స్‌లోని ప్రధాన విమానాశ్రయాన్ని అధికారులు తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించడం, అనుమానిత కేసులను పరిశోధించడం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు ఇప్పటికీ సవాలుగానే మారింది.