పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతి ఇవ్వం.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు

Wait 5 sec.

గత కొన్ని రోజులుగా చేరుకుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారన్న అద్దంకి దయాకర్.. కానీ దానికి అవకాశం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందని.. దానిలో భాగంగానే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ను తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మీటింగ్‌పై బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటే మౌనంగా ఉంటారా అని మండిపడ్డారు.రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తారా.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా అంటూ అద్దంకి దయాకర్ ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్న అద్దంకి దయాకర్.. ఆయన చిచ్చుబుడ్డి వెలిగించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ చెబుతోందని.. అందుకే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున వైషమ్యాలు సృష్టించాలని చూస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన చేసుకోండి అంటూ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేసిన అద్దంకి దయాకర్.. అలాంటి వ్యక్తి తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఒక డిబేట్‌లో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు నమోదు కాగా.. అరెస్ట్ చేస్తారనే వార్తలు రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం సాగుతుండగానే.. హైదరాబాద్ శివారులో చెరువును కబ్జా చేశారంటూ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు రావడం.. ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.