మళ్లీ అదే తంతు.. 10 నిమిషాల్లో సీన్ రివర్స్.. గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్లకుపైగా డౌన్!

Wait 5 sec.

Fall: సోమవారం సెషన్‌లో (జూన్ 1) భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి. 3 గంటల వరకు స్వల్ప నష్టాల్లోనే ఉన్నప్పటికీ.. తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో సెషన్ చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 508 పాయింట్లు తగ్గి 74,267 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్లు తగ్గి 23,383 వద్ద సెషన్ ముగించింది. ఇవాళ్టి సెషన్‌లో ఆరంభంలో ఒక దశలో మంచి లాభాల్లోనే కదలాడాయి. ఇంట్రాడే వరకు కూడా పరిస్థితి బాగానే ఉంది. ఉదయం లాభాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. అది కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కనిపించడం గమనార్హం. కిందటి రోజు 74,775.74 వద్ద ముగిసిన సెన్సెక్స్ సోమవారం రోజు 400 పాయింట్లకుపైగా లాభాలతో 75,203 వద్ద ఓపెన్ అయింది. అదే జోరుతో ఇంట్రాడేలో దాదాపు 600 పాయింట్ల వరకు పెరిగి 75,367.93 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. 3 గంటల వరకు సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు నష్టంలోనే ఉండగా.. తర్వాత కుదేలైంది. అంతకుముందు శుక్రవారం సెషన్‌లో జరిగినట్లే 10 నిమిషాల్లోనే పరిస్థితి మారిపోయింది. ఇవాళ కూడా భారీగా పతనమైంది. 3.10 వరకు చూస్తే సెన్సెక్స్ 570 పాయింట్లకుపైగా నష్టపోయి ఇంట్రాడేలో ఒక దశలో 74,203.68 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. చివరకు 508 పాయింట్ల నష్టంతో 74,267.34 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకుపైగా తగ్గడం గమనార్హం. ఇక మదుపరుల సంపదగా పరిగణించే.. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లకుపైగా తగ్గి రూ. 460.70 లక్షల కోట్లకు చేరింది. ఒక దశలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కోఫోర్జ్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా ఐటీ స్టాక్స్ అన్నీ 5 శాతం వరకు పెరగ్గా.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో 2-3 శాతం లాభాలతోనే ముగిశాయి. ఎస్బీఐ, రిలయన్స్, ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం ఇలా పలు హెవీ వెయిట్ స్టాక్స్ పడిపోయాయి. స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..మార్కెట్ పతనానికి ప్రధాన కారణాల విషయానికి వస్తే.. అమెరికా- ఇరాన్ ఒప్పందం విషయమై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. సోమవారం రోజు మళ్లీ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో కూడా పెరిగాయి. ఇంకా యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. విదేశీ పెట్టుబడిదారులు విపరీతంగా అమ్మకాలు జరిపారు. దీంతో మార్కెట్ కుదేలైంది.