ఇల్లు అమ్మి రూ.2.5 లక్షలు 'క్యాష్' తీసుకున్న మహిళ.. ట్యాక్స్ నోటీసు పంపిన ఐటీ శాఖ.. చివరకు ఏమైందంటే?

Wait 5 sec.

Tax Notice: తమ ఇంటిని విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో మరో ఇల్లు కొనుగోలు చేయడం మధ్య తరగతి కుటుంబాల్లో సాధారణంగా జరుగుతుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్లు సొంత బంధువుల మధ్య జరిగినప్పుడు, అందులో కొంత నగదు రూపంలో ఉన్నప్పుడు శాఖ అనుమానించే అవకాశం ఉంటుంది. చెన్నైకి చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన పాత ఇల్లు అమ్మి, సొంత అల్లుడి వద్ద కొత్త ఇల్లు కొనుగోలు చేసి, పన్ను మినహాయింపు కోరిన ఆమెకు ఆదాయపు పన్ను శాఖ పంపించింది. కానీ, ఆమె వెనక్కి తగ్గలేదు. చట్టపరంగా పోరాడి ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ITAT) చెన్నై బెంచ్‌లో విజయం సాధించింది. అనే వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగిందంటే?చెన్నైలోని మేడవక్కానికి చెందిన శ్రీమతి స్వామినాథన్ అనే మహిళ 2026 అక్టోబర్ నెలలో తన పాత అపార్ట్‌మెంట్‌ను రూ.35.5 లక్షలకు విక్రయించారు. అయితే, ఆ డబుల్లో రూ.2.50 లక్షలను నగదు రూపంలో తీసుకున్నారు. దీంతో పాటు ఇంట్లోని పాత ఎలక్ట్రానికి వస్తువులు, సామాగ్రిని విక్రయించి మరో రూ.8.09 లక్షల నగదు పొందారు. తన భర్త, కుమార్తె ఇచ్చిన గిఫ్ట్ మనీ రూ.1 లక్షతో కలిపి మొత్తం రూ.11.8 లక్షల నగదును తన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత 2017, జనవరిలో తన అల్లుడైన గురుస్వామికి చెందిన ఒక అపార్ట్‌మెంట్‌ను రూ.49 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ ఇల్లు కొనేందుకు స్టాంప్ డ్యూటీ రూ.2.80 లక్షలు, ఇంటీరియర్ డెకరేషన్ కోసం మరో రూ.12 లక్షలు వెచ్చించారు. పాత ఇల్లు అమ్మిన డబ్బును కొత్త ఇల్లు కొనేందుకు వాడినందుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 54 కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు కోరుతూ ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఐటీ నోటీసులు, చెక్కుల క్లియరెన్స్‌లో ఆలస్యం వంటి అంశాలు ఐటీ శాఖ దృష్టిని ఆకర్షించాయి. అసెసింగ్ ఆఫీస్ ఓ కీలక అంశాన్ని లేవనెత్తారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఇల్లు 2017 జనవరిలో కొనుగోలుచేసినట్లు ఉన్నప్పటికీ ఆ ఇంటికి సంబంధఇంచిన రూ.33 లక్షల చెక్కులు మాత్రం 2017 ఆగస్టులో క్లియర్ చేశారని గుర్తించారు. జనవరిలోనే ఇల్లు కొంటే డబ్బులు ఆగస్టులో ఎందుకు చెల్లించారు? ఇంటీరియర్ ఖర్చులు కూడా ఆగస్టులోనే ఎందుకు జరిగాయి? అని ప్రశ్నిస్తూ ఆమె తన బ్యాంకు ఖాతాలో వేసిన రూ.10.8 లక్షల నగదును, కొత్త ఇల్లు కొన్న రూ.49.80 లక్షల మొత్తాన్ని లెక్కలో చూపని ఆదాయంగా పరిగణించి నోటీసులు పంపించారు. అయితే, సదరు మహిళ ఐటీ నోటీసుకు సమాధానం ఇచ్చారు. ఇల్లు రిజిస్ట్రేషన్ 2017 జనవరిలోనే జరిగినా ఆ ఇంట్లో అప్పటికే అద్దెదారులు ఉన్నారని తెలిపారు. వారు ఇల్లు ఖాలీ చేసేందుకు సమయం అడిగారని, వారు ఖాళీ చేసి తాళాలు తన చేతికి ఇచ్చినప్పుడే ఈ చెక్కులను బ్యాంకులో వేసి విత్ డ్రా చేసుకోమని చెప్పినట్లు తెలిపారు. అందుకే చెక్కుల క్లియరెన్స్ ఆగస్టులో జరిగిందని వివరణ ఇచ్చారు. లీజు అగ్రిమెంటును సైతం సమర్పించారు. కానీ ఐటీ అధికారులు, మొదటి అప్పీలేట్ అథారిటీ సమ్మతించలేదు. దీంతో చెన్నై ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ట్రైబ్యునల్ తీర్పుకేసును పరిశీలించిన ట్రైబ్యునల్ ఐటీ శాఖ చేసిన అదనపు పన్ను విధింపులను పూర్తిగా కొట్టి వేస్తూ మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్, బ్యాంక్ రికార్డులు అన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు కేవలం అల్లుడి దగ్గర ఇల్లు కొన్నదనే కారణంతో లేదా చెక్కులు ఆలస్యంగా ఎన్‌క్యాష్ అయ్యాయనే కారణంతో ట్రాన్సాక్షన్లను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. సెక్షన్ 54 కింద కోరిన పున్ను మినహాయింపు పూర్తిగా చెల్లుతుందని, ఐటీ శాఖ విధించిన పన్నులు ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంటూ చెన్నై బెంచ్ ఈ కేసును కొట్టివేసింది.