భారత్ - న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమిండియా కోసం కివీస్ ఓ మెగా టూర్ ప్లాన్ చేసింది. ఏకంగా 40 రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేలా టెస్టు, టీ 20, వన్డేలతో ఓ మెగా సిరీస్‌నే సిద్ధం చేసింది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటించనుంది. ఈ టూర్‌లో ఐదు టీ20లు, రెండు టెస్టులతో పాటు ఐదు వన్డేల సిరీస్ కూడా ఉండటం విశేషం. న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా పర్యటన ఒకటిగా నిలవనుంది. అలాగే ఒకే పర్యటనలో ఓ విదేశీ జట్టుతో న్యూజిలాండ్ ఆడనున్న అత్యధిక మ్యాచ్‌ల సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. భారత్ - న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సిరీస్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 22 నుంచి పెద్ద పండగభారత్ - న్యూజిలాండ్ మధ్య ఈ సిరీస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా అక్టోబర్ 22న తొలి టీ20 మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం నవంబర్ 4 నుంచి ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నవంబర్ 19 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నారు. నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో రెండో టెస్టు నిర్వహిస్తారు. భారత్ చివరిసారిగా 2019 - 20 సీజన్‌లో టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్‌‌కు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ న్యూజిలాండ్ రెండుసార్లు భారత్‌లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25లో 3- 0తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్, కోహ్లి టెస్టు రిటైర్మెంట్‌కు బీజం పడింది కూడా ఈ సిరీస్ నుంచే!న్యూజిలాండ్‌లో భారత పర్యటన పూర్తి షెడ్యూల్టీ20 సిరీస్మొదటి టీ20 - అక్టోబర్ 22, క్రైస్ట్ చర్చ్. రెండో టీ20 - అక్టోబర్ 24, క్రైస్ట్‌చర్చ్. మూడో టీ20 - అక్టోబర్ 27, వెల్లింగ్టన్. నాలుగో టీ20 - అక్టోబర్ 30, ఆక్లాండ్. ఐదో టీ20 - నవంబర్ 1, హామిల్టన్. వన్డే సిరీస్: మొదటి వన్డే - నవంబర్ 4, ఆక్లాండ్. రెండో వన్డే - నవంబర్ 7, వెల్లింగ్టన్. మూడో వన్డే - నవంబర్ 10, హామిల్టన్. నాలుగో వన్డే - నవంబర్ 13, మౌంట్ మాంగనుయ్, ఐదో వన్డే - నవంబర్ 15, మౌంట్ మాంగనుయ్. టెస్టు సిరీస్: మొదటి టెస్టు - నవంబర్ 19-23, వెల్లింగ్టన్. రెండో టెస్టు - నవంబర్ 27 - డిసెంబర్ 1, క్రైస్ట్ చర్చ్.