పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. 48 గంటల్లో స్వరూపమే మారిపోయింది..

Wait 5 sec.

ప్రత్యేక చొరవతో రాజమహేంద్రవరం ఏవీఏ కాలువ స్వరూపమే మారిపోయింది. రాజమహేంద్రవరం AVA కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, తీవ్ర కాలుష్య పరిశీలించారు. ఇటీవల రాజమండ్రిలో పర్యటించిన .. రాజవోలు గ్రామపంచాయతీ నుంచి తిరిగి వస్తూ ఆవ ఛానెల్‌ను పరిశీలించారు. ఎస్టీపీ నుంచి వచ్చే ఈ ఛానెల్ పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్, జేసీలను పిలిచి కాలువలో వ్యర్ధాలు పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల్లో స్వచ్ఛరథాలు మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. వెంటనే ఛానల్ సరిదిద్దేలా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుమారు 3 కిలోమీటర్ల మేర విస్తరించిన AVA కాలువను అధికారులు శుభ్రపరిచారు. కాలువను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువ నుంచి తొలగించారు. కేవలం 48 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కాలువలో తగిన ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. నిరంతర పర్యవేక్షణతో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రత నిర్వహణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత. ప్రజారోగ్య సంరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మరోవైపు గోదావరి, కృష్ణా వాటిని శుభ్రపరిచేందుకు మిషన్ క్లీన్ గోదావరి, క్లీన్ కృష్ణా ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులు అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గుర్తించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలు కలుషితం కాకుండా చర్యలు చేపట్టేందుకు రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ నిధుల ద్వారా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కాలువల్లో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.