డఫాబెట్‌ బెట్టింగ్ యాప్ కేసు.. రూ.10 లక్షలు మోసపోయిన కరీంనగర్ వ్యక్తి, 11 మంది అరెస్ట్

Wait 5 sec.

బెట్టింగ్ యాప్‌ మోసాలపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. తాజాగా మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. డఫా బెట్ బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు.. దేశంలోని పలు రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్‌ను పంపించి.. నిందితులను పట్టుకున్నారు. వీరిలో ఒక విదేశీయుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన ఓ బాధితుడు.. ఈ డఫా బెట్ యాప్‌లో ఏకంగా రూ.10 లక్షలు మోసపోగా.. అతడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు.. ఇంటర్నేషనల్ బెట్టింగ్ రాకెట్ ముఠా ఆట కట్టించారు. డబ్బులు దండుకోవడం మాత్రమే కాకుండా.. ఈ బెట్టింగ్ బారిన పడి యూత్ ఆత్మహత్యలు చేసుకుంటుడడంతో.. ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై తెలంగాణ సీఐడీ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ మోసాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌) ఏర్పాటు చేసిన సీఐడీ అధికారులు.. తాజాగా ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా రాకెట్‌ను ఛేదించింది. అందులో ఒక బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ డఫాబెట్ వేదికగా మోసాలకు పాల్పడుతున్న 11 మంది నిందితులను తాజాగా సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు చెందిన ఒక బాధితుడు డఫాబెట్‌లో దాదాపు రూ.10 లక్షలు మోసపోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ కేసును సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌ వంటి రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్‌ను పంపించి.. అక్కడ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఒక అఫ్గానిస్థాన్ పౌరుడు సహా మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు.. తాజాగా సీఐడీ చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఈ 11 మంది బెట్టింగ్ నిర్వాహకులు అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 3 కార్లతోపాటు.. 8 ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్స్, 5 పాస్‌పోర్టులు, రూ.3.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ 11 మంది నిందితులపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, తెలంగాణలో 225 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.