ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్‌లో మంగళవారం (జూన్‌ 2) పేరుతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అంశాన్ని ప్రస్తావించకుండా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "అదృష్టమనేది అందరినీ వరించదు. కొందరు అవిశ్రాంతంగా శ్రమించి, వైఫల్యాలను చవిచూసి, తిరిగి పుంజుకుని విజయాన్ని సాధిస్తారు. అలాంటి విజయం సాధారణమైనది కాదు.. అదో చరిత్రగా నిలిచిపోతుంది.. అదే పవన్ కళ్యాణ్ కథ. అధికారులు గానీ, ప్రతిపక్షం గానీ దానిని అణచివేసేందుకు ప్రయత్నించినప్పుడు, అది ఆయనకు అతిపెద్ద విజయంగా మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే." అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణకు కారణాలు..మరోవైపు జూన్ రెండో తేదీ మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ రెండో తేదీ సంధ్య కన్వెన్షన్‌లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ 2 వేల మందితో సమావేశం నిర్వహణకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి అనుమతి కోరినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై కేసులు, దీంతో తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్తత, కొంతమంది ఏపీ నేతల వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అలాగే ఆవిర్భావ దినోత్సవ సమయంలో పవన్ కళ్యాణ్ సమావేశం వలన నిరసనలు, ట్రాఫిక్ అంతరాయాలు కలగటంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే సంధ్య కన్వెన్షన్‌లోనూ సరిపడా పార్కింగ్ లేదని.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు.