ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ అదరగొట్టాడు. గతంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తాడనే విమర్శలు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ.. ఈ సీజన్‌లో మాత్రం బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులోని ప్రధాన బౌలర్‌ను టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టాడు. ప్రధాన బౌలర్‌ బౌలింగ్‌లో రన్స్ చేస్తే.. ఇతర బౌలర్లంతా ఒత్తిడిలోకి వెళ్తారని భావించే కోహ్లీ.. ఈ సీజన్‌లో అదే చేసి చూపించాడు. గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో పరుగుల వరద పారించాడు. అతడి బౌలింగ్‌లో ఈ సీజన్‌లో ఏకంగా 88 పరుగులు రాబట్టాడు. దీంతో ఓ ఐపీఎల్ సీజన్‌లో ఓ బౌలర్‌పై అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడుఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య నాలుగు మ్యాచులు జరిగాయి. ఇందులో లీగ్ స్టేజ్‌లో రెండు మ్యాచులు జరగ్గా.. క్వాలిఫయర్ 1, ఫైనల్‌లోనూ ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులలో కగిసో రబాడపై విరాట్ కోహ్లీ.. స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. ఏకంగా 88 రన్స్ అతడి బౌలింగ్‌లోనే రాబట్టాడు. ఫైనల్‌లో అయితే అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఓ సీజన్‌లో బౌలర్‌పై అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ రెండో ప్లేసులో ఉన్నాడు. ఇషాన్ కిషన్.. సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో 74 రన్స్ రాబట్టాడు.ఐపీఎల్ సీజన్‌లో ఓ బౌలర్‌పై అత్యధిక రన్స్ కొట్టిన ప్లేయర్లు88 - విరాట్ కోహ్లీ vs (ఐపీఎల్ 2026)74 - ఇషాన్ కిషన్ vs జోఫ్రా ఆర్చర్ (ఐపీఎల్ 2026)71 - గ్లెన్ మ్యాక్స్‌వెల్ vs అశ్విన్ (ఐపీఎల్ 2014)71 - షేన్ వాట్సన్ vs సందీప్ (ఐపీఎల్ 2018)65 - జోస్ బట్లర్ vs యశ్ దయాల్ (ఐపీఎల్ 2022)63 - విరాట్ కోహ్లీ vs ఉమేశ్ యాదవ్ (ఐపీఎల్ 2013)62 - రిషభ్ పంత్ vs మోహిత్ శర్మ (ఐపీఎల్ 2024)60 - డేవిడ్ మిల్లర్ vs రవీంద్ర జడేజా (ఐపీఎల్ 2014)60 - సంజూ శాంసన్ vs నటరాజన్ (ఐపీఎల్ 2026)60 - వైభవ్ సూర్యవంశీ vs మహమ్మద్ సిరాజ్ (ఐపీఎల్ 2026)