ఇన్వెస్టర్లకు శుభవార్త.. 'ఓయో' ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. టార్గెట్ రూ. 6650 కోట్లు..

Wait 5 sec.

: ఇన్వెస్టర్లను ఊరిస్తూ వస్తున్న ఓయో నుంచి ఎట్టకేలకు ఐపీఓ రాబోతుంది. ఓయో పేరెంట్ కంపెనీ ప్రిజమ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆమోదం లభించింది. ఓయో నుంచి ఐపీఓ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరిగినా.. అది కార్యరూపం దాల్చలేదు. మధ్యలో కొన్నిసార్లు ఐపీఓ ప్రణాళికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు సెబీ ఆమోదం నేపథ్యంలో మరికొద్ది నెలల్లో ఈ ప్రిజమ్ ఐపీఓ రానుందని చెప్పొచ్చు. మంచి ఆదరణ ఉన్న సంస్థ కాబట్టి.. ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. వాస్తవానికి జనం ప్రముఖ కంపెనీ ఐపీఓ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మార్కెట్ పరిస్థితులు బాగోలేనందున పెద్ద పెద్ద కంపెనీలు ప్రస్తుతం ఐపీఓ ప్రాసెస్‌ను వాయిదా వేస్తున్నాయి. ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ అంటే కొత్త షేర్ల జారీ ద్వారానే ఉంటుందని పేర్కొంది. అంటే పాత పెట్టుబడిదారులు తమ వాటాల్ని విక్రయించడం లేదు కాబట్టి.. ఆఫర్ ఫర్ సేల్ (OFS) లేదు. పూర్తిగా కొత్త షేర్లను ఇష్యూ చేసి.. ఐపీఓ ద్వారా రూ. 6,650 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను సుమారు 7-8 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో చూస్తే ఇది గరిష్ఠంగా రూ. 76 వేల కోట్లకుపైగానే ఉంటుందని తెలుస్తోంది. 2025 డిసెంబరులోనే ప్రిజమ్ సంస్థ.. కాన్ఫిడెన్షియల్ రూట్ ద్వారా సెబీ దగ్గర ముసాయిదా పత్రాల్ని దాఖలు చేసింది. తాజాగా సెబీ నుంచి ఆమోదం లభించింది. దీని తర్వాత కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP) దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐపీఓ అధికారికంగా లాంఛ్ చేస్తుంది. అప్పుడే ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ తేదీలు, పరిమాణం, షేర్ ఇష్యూ ప్రైస్, కనీస పెట్టుబడి, లిస్టింగ్ డేట్ వంటి వివరాలు బయటికి వస్తాయి.>>అసలు ఇక్కడ కాన్ఫిడెన్షియల్ రూట్ అంటే కంపెనీలు.. తమ ఐపీఓ పత్రాల్ని సెబీకి రహస్యంగా సమర్పించే విధానం. సాధారణంగా కంపెనీలు ఐపీఓకు వెళ్లేప్పుడు.. కంపెనీల ఆర్థిక వివరాలు ఇతర వ్యాపార రహస్యాలు అన్నీ బహిరంగంగానే వెల్లడిస్తాయి. కానీ కాన్ఫిడెన్షియల్ రూట్‌లో ఆ అవసరం ఉండదు. సెబీ మార్పులు చెబితే కూడా ప్రజలకు తెలియకుండానే కంపెనీలు అప్డేట్ చేస్తుంటాయి. అప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోతే ఐపీఓ ప్రాసెస్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు కంపెనీకి కూడా ఇబ్బంది రాదు.