నిరుద్యోగులకు తీపి కబురు.. 3 నోటిఫికేషన్లు జారీ చేసిన టీజీపీఎస్సీ, పూర్తి వివరాలివే..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఉద్యోగార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ఒకేసారి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాఖల్లో మొత్తం 290 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిని ఉద్యోగ ప్రకటనల సంవత్సరంగా మారుస్తామని, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ నోటిఫికేషన్లు ఇస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలను అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షలను ఓఎంఆర్‌ విధానంలో లేదా కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష పద్ధతిలో నిర్వహిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులకు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకునేందుకు కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా తెలిపారు. 2026 జులై 1వ తేదీ నాటికి ఈ వయోపరిమితిని ప్రామాణికంగా తీసుకుంటారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని టీజీపీఎస్‌సీ కార్యదర్శి ఎం.హరిత సూచించారు.పరీక్షల షెడ్యూల్ ఇదే.. వివిధ శాఖల్లోని పోస్టుల భర్తీ దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే.. ఆర్‌అండ్‌బీ శాఖలో 222 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (సివిల్) పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కమిషన్ విడుదల చేసిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం వీరికి అక్టోబరులో పరీక్షలు ఉంటాయి. ఆర్‌అండ్‌బీ శాఖలోనే మరో 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులకు ఈ నెల 8 నుంచి జులై 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరికి కూడా అక్టోబరు నెలలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్ల పోస్టులకు ఈ నెల 10 నుంచి జులై 17వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్షలను మాత్రం సెప్టెంబరు నెలలోనే నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.