కేంద్రం కఠిన నిర్ణయం.. 'వెండి'పై మరిన్ని ఆంక్షలు.. ఇక అలా కొంటే అనుమతి తప్పనిసరి!

Wait 5 sec.

Silver Imports: పెరుగుతున్న దిగుమతులను అరికట్టడానికి, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడానికి కేంద్రం వెండి దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా వెండిని గ్రెయిన్, పొడి రూపాల్లో ఉన్న వెండి దిగుమతిని నిషేధిత జాబితాలోకి చేర్చింది. పొడి, గ్రెయిన్ రూపాల్లో భద్రపరిచే కేటగిరీ కిందకు తీసుకురావడంతో పాటు, దిగుమతిదారులు ముందస్తు ప్రభుత్వ అనుమతి పొందాలని కూడా ఆదేశించింది. 99.9 శాతం స్వచ్ఛత గల వెండి ఉన్న గ్రెయిన్, పొడి, ఇతర రూపాల్లోని వండి వస్తువుల దిగుమతిని నిషేధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే 99.99 శాతం ప్యూరిటీ గల వండి కడ్డీల దిగుమతులను, పాక్షికంగా తయారైన అన్ని రకాల వెండి వస్తువులను నిషేధిత జాబితాలో కేంద్రం చేర్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా విదేశీ మారకపు నిల్వపపై ఒత్తిడిని తగ్గించేందుకు వెండి, బంగారం దిగుమతుల సుంకాన్ని భారీగా పెంచింది. 6 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని రెండింతలకు పైగా పెంచి 15 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోకి వెండి దిగుమతులు భారీగా పెరుగుతున్న క్రమంలో మరిన్ని ఆంక్షలు విధించింది. ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే వెండిని అత్యధికంగా వినియోగించే దేశంగా భారత్ ఉంది. మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులపై రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంతకు ముందు ఏడాది ఈ మొత్తం 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో వెండి దిగుమతులు గతేడాదితో పోలిస్తే 157 శాతం మేర పెరిగి 411 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.పెరిగిన చమురు ధరల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని అరికట్టే విస్తృత ప్రయత్నాల్లో భాగంగా విలువైన లోహాల దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గత నెలలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. అయితే కొత్త నిబంధనలు దిగుమతిదారులకు అనిశ్చితిని సృష్టించవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశంలో వెండిని ఆభరణాలు, నాణేలు, కడ్డీలు, అలాగే సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి పారిశ్రామిక అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. బలమైన పెట్టుబడిదారుల ఆసక్తి కూడా దీనికి తోడైంది. గత సంవత్సరంలో సిల్వర్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) లోకి నిధుల ప్రవాహం రికార్డు స్థాయికి చేరుకుంది.