ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత సీజన్‌లో తొలి టైటిల్ అందుకున్న ఆర్సీబీ.. వరుసగా రెండోసీజన్‌లోనూ ట్రోఫీ ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి.. ఎటాకింగ్ ఛాంపియన్‌లా ఆడి టైటిల్ సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో గెలుపొంది ఈ ఫీట్ సాధించింది. 5 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది.ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలమైన టాప్-3 బ్యాటర్లు ఈ మ్యాచులో విఫలమయ్యారు. వీరంతా స్వల్ప స్కోరు చేసి పెవిలియన్ చేరిపోయారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 155/8 రన్స్ చేసింది.అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆర్సీబీకి.. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32 రన్స్), విరాట్ కోహ్లీ మెరుపు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 27 బంతుల్లో 62 పరుగులు జోడించి.. జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వెంకటేశ్ అయ్యర్, దేవ్‌ద్ పడిక్కల్ (1), రజత్ పటీదార్ (15), కృనాల్ పాండ్యా (1) ఔట్ అయ్యారు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మాత్రం నిలబడ్డాడు. చివరి వరకూ క్రీజులో ఉండి.. జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్ అందించాడు. చివరకు ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ42 బంతుల్లో 75 రన్స్ స్కోరు చేసి, అజేయంగా నిలిచాడు.ఈ ఫలితంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత సీజన్‌లో తొలి టైటిల్ అందుకున్న ఆ జట్టు.. ఈ సీజన్‌లోనూ అలాంటి ప్రదర్శనే రిపీట్ చేసింది. మరోవైపు ఐపీఎల్‌లో తమ అరంగేట్ర సీజన్ అయిన 2022లో విజేతగా నిలిచిన గుజరాత్.. రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌లో ఓడిపోయింది. ఐపీఎల్ 2023 ఫైనల్‌లోనూ సీఎస్కే చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైంది.