. దేశీయ. అంతర్జాతీయ సంస్థలు ఎన్నో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు ఇలా కారణాలు ఎన్నో.. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ వ్రతి జిల్లాలోనూ పెట్టుబడులు పెట్టేందుకు, తమ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గూగుల్, విప్రో, కాగ్నిజెంట్ వంటి ఐటీ రంగ సంస్థలతో పాటుగా గ్రీన్ హైడ్రోజన్, స్టీల్, సోలార్, డిఫెన్స్ ఇలా అనేక రంగాలలో భారీ ప్రాజెక్టులు ఏపీకి తరలివస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రానికి షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మరో భారీ ప్రాజెక్టు దక్కించుకుంది. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీపడుతోంది ఏపీ. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను దక్కించుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం మూడేళ్ల ప్రయత్నాలకు గండి కొడుతూ.. ఏపీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా రక్షణ మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పుట్టపర్తిలో నాయుడుతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వం మూడేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. హోసూర్‌లో ఈ డిఫెన్స్ హబ్ ఏర్పాటు చేసే విషయమై తమిళనాడు సర్కారు గత మూడేళ్లుగా డీఆర్‌డీవోతో చర్చలు జరుపుతోంది. ప్రతిపాదిత హోసూర్ విమానాశ్రయానికి ఆనుకుని AMCA ఫ్లైట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని డీఆర్డీవోకు తమిళనాడు సర్కారు ప్రతిపాదించింది. ఇందులో ఒక వైపు పరీక్షా కేంద్రం, మరో వైపు ప్యాసింజర్ టెర్మినల్ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అయితే డీఆర్‌డీవో ఈ ప్రాజెక్టు కోసం ఏపీని ఎంచుకుంది. మరోవైపు హోసూర్‌లో ప్రతిపాదించిన 3.5 కిలోమీటర్ల రన్‌వేతో పోలిస్తే, పుట్టపర్తిలోని రన్‌వే 2.1 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉందని ఈ చర్చల గురించి తెలిసిన అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం అదనపు భూమిని సేకరించి.. రన్‌వేను 3 కిలోమీటర్లకు విస్తరించాల్సి ఉంటుందని చెప్తున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం డీఆర్డీవో కోరినట్లుగా హోసూరులో 3.5 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణంతో పాటుగా వంద ఎకరాలను ఉచితంగా అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి హోసూరు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని డీఆర్డీవోకు సూచించినట్లు తెలిసింది. అయితే డీఆర్డీవో మాత్రం సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2030 నాటికి తమిళనాడు 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించాలంటే ఏపీతో పోటీతత్వాన్ని కోల్పోకూడదని తమిళనాడులోని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతీ పెట్టుబడి కోసం అత్యంత దూకుడుగా పోటీపడుతోందని.. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విషయంపై బలంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.