నీట్ రీ ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించిన ఎన్‌టీఏ.. విద్యార్థులకు కీలక సూచన

Wait 5 sec.

పేపర్ లీక్ వివాదం కారణంగా నీట్-యూజీ 2026 ఎగ్జామ్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం ప్రకటించింది. దీంతో వైద్య విద్య చదవడం కోసం సన్నద్ధం అవుతోన్న లక్షలాది మంది ఆశావహులు మరోసారి నీట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.నీట్ ఎగ్జామ్ రీ షెడ్యూల్ విషయాన్ని ఎన్‌టీఏ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఆదివారం, జూన్ 21న నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ విషయమై భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు వెల్లడించింది.ఏదైనా సమాచారం, పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం తమ అధికారిక కమ్యూనికేషన్ ఛానెళ్ల మీద ఆధారపడాలని నీట్ క్యాండిడేట్స్, తల్లిదండ్రులకు ఎన్‌టీ సూచించింది.గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ అధ్యక్షత సీనియర్ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో నీట్ రీ ఎగ్జామినేషన్ విషయమై చర్చించారు.మే 3వ తేదీన నీట్ ఎగ్జా్మ్ జరగ్గా.. దానికి కొన్ని వారాల ముందే గెస్ పేపర్ పేరిట ఓ ప్రశ్నాపత్రం వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వైరల్ అయ్యింది. ఇందులో ఉన్న ప్రశ్నలు పెద్ద సంఖ్యలో నీట్ ఎగ్జామ్‌లోనూ వచ్చాయి. ఈ గెస్ పేపర్లోని దాదాపు 120 నుంచి 140 ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామ్ పేపర్‌తో మ్యాచ్ అయ్యాయి. దీంతో వివాదం చెలరేగింది.తొలుత నీట్ పేపర్ లీకైందనే రూమర్లను ఎన్‌టీ కొట్టిపారేసింది. కానీ వివిధ రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లు, దళారుల అనుమాస్పద చర్యలపై పోలీసులు, కేంద్ర విచారణ సంస్థలు విచారణ ప్రారంభించాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, బిహార్, కేరళలోని కొరియర్ నెట్‌వర్క్‌లు, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, కోచింగ్ సర్కిళ్ల ద్వారా పేపర్ కాపీలు సర్క్యులేట్ అయ్యాయని దర్యాప్తు అధికారుల వెల్లడించారు.గెస్ పేపర్‌ పేరిట ఉన్న డాక్యుమెంట్‌లో 410 ప్రశ్నలు ఉండగా.. ఇందులోని కెమిస్ట్రీ సెక్షన్‌లో ఉన్న దాదాపు 120 ప్రశ్నలు పేపర్‌తో సరిపోలాయని సమాచారం. నీట్ పరీక్ష జరగడానికి 15 రోజుల నుంచి నెల రోజుల ముందే విద్యార్థుల మధ్య ఈ గెస్ పేపర్ సర్క్యులేట్ అయ్యింది. ఎగ్జామ్‌కు 42 గంటల ముందు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ గెస్ పేపర్ షేర్ అయ్యింది.దీంతో మే 3న జరిగిన నీట్-యూజీ 2026ను రద్దు చేస్తున్నట్లు మే 12వ తేదీన ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది. పరీక్ష ప్రక్రియ సమగ్రత దెబ్బతినడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడటానికి, నేషనల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడటానికి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. పేపర్ లీక్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది.