బ్యాడ్మింటన్ కోర్టులో తన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేసి అభిమానులకు సంపాదించుకున్న .. ఇప్పుడు ఒక గెలుచుకుంటున్నారు. తన బిడ్డకు పాలిస్తూనే.. ఆ భాగ్యం లేని అనాథలు, అనారోగ్యంతో ఉన్న పసిపాపల ఆకలి తీర్చి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తన బాబు పుట్టిన మొదటి ఏడాదిలో సుమారు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులలోని మిల్క్ బ్యాంక్‌లకు ఆమె విరాళంగా ఇచ్చారు.కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు, ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న కిలో బరువున్న పసిబిడ్డకు కొన్ని రోజుల పాటు అమృతంలా ఉపయోగపడతాయని ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను చేసిన ఈ చిన్న సహాయం ఎంతోమంది చిన్నారులకు ప్రాణదానం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు వచ్చే ప్రాణాంతక వ్యాధులైన 'నెక్రోటైజింగ్ ఎంట్రోకోలిటిస్' వంటి పేగు సంబంధిత వ్యాధుల నుండి తల్లిపాలు గొప్ప రక్షణ కల్పిస్తాయని ఆమె వివరించారు.'నేను పాప పుట్టిన మొదటి ఏడాదిలో హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సుమారు 60 లీటర్ల తల్లి పాలను విరాళంగా ఇచ్చాను. దీని వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అడగవచ్చు.. కేవలం 100 మి.లీ. దాత పాలు, ఒక కిలో బరువున్న చిన్నారికి కొన్ని రోజుల పాటు ఆహారంగా ఉపయోగపడతాయి. నేను చేసిన ఈ విరాళం ఎంతోమంది NICUలో ఉన్న శిశువులకు ప్రాణదానం చేసినట్లు అవుతుంది. పాలను దానం చేయడం అనేది ఎంతో సురక్షితమైన ప్రక్రియ.చాలా మంది శిశువులకు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల పుట్టగానే తల్లి పాలు అందుబాటులో ఉండవు. అటువంటి క్లిష్ట సమయంలో దాతలు ఇచ్చే పాలు ఒక వారధిలా పనిచేసి ఆ పసిపిల్లలకు అవసరమైన రోగనిరోధక శక్తిని, పోషణను అందిస్తాయి. తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యం, పోషకాహార లోపం లేదా ముందస్తు ప్రసవం వంటి కారణాల వల్ల తల్లులకు పాలు ఆలస్యంగా పడవచ్చు. అటువంటి సమయంలో ఈ పాలు ఎంతో కీలకం. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ప్రాణాంతకమైన నెక్రోటైజింగ్ ఎంట్రోకోలిటిస్ అనే పేగు సంబంధిత వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ఈ పాలు గణనీయంగా తగ్గిస్తాయని నిరూపితమైంది. మీరు కూడా ఎలా సహాయం చేయవచ్చునో తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించండి' అని గుత్తా జ్వాల ట్విట్టర్ ఎక్స్‌లో వెల్లడించారు. గుత్తా జ్వాల ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు గతేడాది ఏప్రిల్‌లో కూతురు జన్మించింది. అప్పట్నుంచి ఆమె తన చనుపాలను దానం చేస్తున్నారు. మాతృత్వాన్ని కేవలం తన బిడ్డకే పరిమితం చేయకుండా.. ఆపదలో ఉన్న పసిపాపలకు పంచుతున్న గుత్తా జ్వాల నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఎంత పుణ్యం చేస్తున్నావ్ తల్లీ' అంటూ ఆమెను కొనియాడుతున్నారు. చిన్నారుల పాలిట అమృతమూర్తిగా ఆదర్శంగా నిలిచారని అంటున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెబుతున్నారు.