అప్పుడే అయిపోలేదు.. మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక బాదుడే.. ఎందుకు పెరుగుతాయంటే?

Wait 5 sec.

Crude Oil Price: శుక్రవారం రోజు ఉదయం పూట వాహనదారులకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. . లీటరుపైన రూ. 3 కంటే ఎక్కువే పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 3.39 మేర పెరగడంతో ఇప్పుడు రూ. 110.89 కి చేరింది. మరోవైపు డీజిల్ ధర కూడా రూ. 3.26 పెరగడంతో ఇది లీటర్ ధర రూ. 98.96 కు చేరింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇంధన ధరల పెంపు ఇప్పటితో అయిపోలేదని మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. దీనికి కారణాల్ని కూడా చెబుతున్నారు. అదేంటో చూద్దాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్ మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమవడానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన ఉండేది కాస్తా.. ఒక దశలో 125 డాలర్ల స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం 108 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతకుముందు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని సవరించేవారు. కానీ ఇటీవల మాత్రం క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నా.. చమురు కంపెనీలు నష్టాల్ని భరిస్తూ రేట్లను యథాతథంగానే ఉంచుతూ వచ్చాయి. కేంద్రం ప్రత్యామ్నాయంగా ఇంధనంపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి కాస్త ఉపశమనం కలిగించింది. అయినప్పటికీ 3 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియంలకు కలిపి రోజుకు రూ. 1000 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక భారం భరించలేక.. ధరల్ని పెంచేశాయి. వాస్తవానికి తాజాగా పెంచిన రూ. 3 అనేది పెద్ద పెంపు ఏం కాదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల ఆయిల్ కంపెనీలకు నష్టాలు తగ్గవని అంటున్నారు. కొద్ది రోజుల కిందట అంచనా వేసింది. దీంతో ధరల పెంపు ఇక్కడితో అయిపోలేదన్న భావన, భయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. . ఏదో పెద్ద ఉపద్రవం రాబోతున్నట్లు కామెంట్లు చేశారు. ఇది మరింత భయాల్ని రేకెత్తిస్తోంది.ఇదే సమయంలో.. కొద్ది రోజుల కిందట పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన ధరలపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రతి 15 రోజులకు ఓసారి పెట్రోల్, డీజిల్ ధరల్ని సమీక్షించనున్నట్లు వెల్లడించింది. దీంతో మళ్లీ మే చివర్లో లేదా జూన్ 1న ధరలు పెరగొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.