బండి భగీరథ్‌ పోక్సో కేసు.. హైకోర్టులో లాయర్ల మధ్య గొడవ.. జడ్జి తీవ్ర ఆగ్రహం

Wait 5 sec.

తెలంగాణ హైకోర్టులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బాధితురాలి తరఫున వాదినలు చేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర రావు.. బండి భగీరథ్‌ను ఉద్దేశించి క్రిమినల్ అని సంబోధించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. లాయర్ నాగేశ్వర రావు తీరు పట్ల తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. కేసులో నేరం నిరూపణ అయ్యే వరకు దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కల్పించుకున్న జడ్జి.. వారిద్దరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి భగీరథ్‍పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విషయంలో ఇరుపక్షాల మధ్య వాడీవేడీ వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా బండి భగీరథ్‌ను క్రిమినల్ అంటూ.. బాధితురాలి తరఫు లాయర్ సంబోధించడం వాగ్వాదానికి దారి తీసింది. ఆ లాయర్ చేసిన వ్యా్ఖ్యల పట్ల బండి భగీరథ్ తరఫు లాయర్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు లాయర్ల మధ్య కోర్టులో జడ్జి ముందే తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. నేర రుజువు అయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ వ్యక్తిని కూడా నేరస్థుడు అనకూడదని తేల్చి చెప్పారు. లాయర్లు కోర్టులో సంయమనంతో లేకపోతే ఈ పిటిషన్‌ను ఇంకో బెంచ్‌కు మార్చుకోవచ్చని జడ్జి సూచించారు. దీంతో ఇద్దరు లాయర్లు శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బండి భగీరథ్ తరఫు లాయర్ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. 2021లో ర్యాష్ డ్రైవింగ్‌లో పట్టుబడినప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు అని పోలీసుల ఛార్జిషీట్‍లో పేర్కొన్నారని.. అలా చూస్తే.. ఆమె ఇప్పుడు 20 ఏళ్లు ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఛార్జిషీట్.. ఆమె బర్త్ సర్టిఫికెట్లలో వేర్వేరు డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండటం పట్ల హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బాధితురాలి నిజమైన పుట్టిన తేదీని నిర్ధారించేందుకు ఆమె బర్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.