: మీరు ఒక ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగి అయితే మీ ఈపీఎఫ్ సేవింగ్స్ అనేవి కేవలం రిటైర్మెంట్ కోసం కాదు. మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌తో పాటు మీరు నెల నెలా డిపాజిట్ చేసే సొమ్ము నుంచి కొంత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కి వెళ్తుంది. ఇది మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది. లభిస్తుంది. అయితే, కొన్నిసార్లు అనుకోని సంఘటన ఎదురైన ఆ ఉద్యోగి 58 ఏళ్ల వయసు రాకముందే చనిపోతే పరిస్థితి ఏంటి? అది ఉద్యోగి జీవిత భాగస్వామి, పిల్లలు, నామినీలకు ఎలా వర్తిస్తుంది? ప్రతి ఒక్క ఉద్యోగి ఈపీఎస్ పెన్షన్ రూల్స్ తెలుసుకోవాలి. పదవీ విరమణ కాకముందే ఉద్యోగి మరణిస్తే ఈపీఎస్ ఫ్యామిలీ పెన్షన్ రూల్స్, ఈపీఎఫ్, ఈడీఎల్ఐ బెనిఫిట్స్ అన్నీ ఫ్యామిలీకి వర్తిస్తాయి. మల్టిపుల్ పెన్షన్ కేటగిరీల ద్వారా పీఎఫ్ అకౌంట్ హోల్డర్ కుటుంబానికి బెనిఫిట్స్ లభిస్తాయి. మరి అది ఏ సందర్భాల్లో ఎలా ఉంటుంది.10 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక చనిపోతేఈపీఎస్ పెన్షన్ రావావాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీస్ ఉండాలి. ఒక వేళ 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత రిటైర్మెంట్ లోపే సదరు పీఎఫ్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది. వారికి 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇది మొదలవుతుంది. ఇది జీవితాంతం లేదా మరో పెళ్లి చేసుకునే వరకు లభిస్తుంది. కనీస పెన్షన్ రూ.1000గా ఉంది. దీనికి అదనంగా ఇద్దరు పిల్లలకు చైల్డ్ పెన్షన్ 25 శాతం వారికి 25 ఏళ్లు వచ్చే వరకు వస్తుంది. దివ్యాంగ పిల్లలు ఉంటే వారి జీవితాంతం ఈ పెన్షన్ లభిస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు మరణిస్తే ఆనాధలైన పిల్లలకు 75 శాతం పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తి కాకముందే చనిపోతేఉద్యోగంలో చేరి 10 ఏళ్ల సర్వీసు పూర్తి కాకముందే చనిపోయినట్లయితే అతడి కుటుంబానికి నెలవారీ పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉండదు. అయితే, పీఎఫ్, ఈపీఎస్ అకౌంట్లోని డబ్బులు తీసుకునేందుకు అర్హత ఉంటుంది. అర్హులైన కుటుంబ సభ్యులు లేకపోతే నామినీకి ఇస్తారు.ఇతర ప్రయోజనాలుఈపీఎస్ కంట్రిబ్యూషన్ ద్వారా పెన్షన్ మాత్రమే కాకుండా అదనపు బెనిఫిట్స్ ఉంటాయి. ఈపీఎఫ్‌లోని డబ్బులు తీసుకునేందుకు నామినీకి చట్టపరంగా అర్హత ఉంటుంది. పీఎఫ్ ఖాతాలోని డబ్బులు, వడ్డీ మొత్తం తీసుకోవచ్చు. సర్వీసు కాలంలో ఉద్యోగి మరణిస్తే వస్తుంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా లభిస్తాయి. ఉద్యోగి మరణించిన తర్వాత అతడి కుటుంబం లేదా నామినీ ఫారం 10 డీ లేదా 20ని సబ్మిట్ చేసి ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.