కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రేపుతుండగా.. ఇవాళ ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే వారం రోజులు వాయిదా వేస్తూ.. ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ శుక్రవారం రోజున మధ్యంతర బెయిల్‌కు సంబంధించిన విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. బండి భగీరథ్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర రావు హాజరయ్యారు. ఈ కేసు వాదనల సందర్భంగా.. అసలు ఈ పోక్సో కేసు పెట్టిన బండి భగీరథ్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ నిరంజన్ రెడ్డి.. అసలు ఆమె మెనర్ కాని.. ఆమె వయసు 19 ఏళ్ల నుంచి 20 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఆమె రకరకాల తేదీలతో వేర్వేరు బర్త్ సర్టిఫికెట్లు తీసుకుందని కోర్టుకు విన్నవించారు. బాధితురాలి తల్లి కావాలనే తప్పుడు రికార్డులు, సర్టిఫికెట్లతో ఆమె వయసును తగ్గించి పోక్సో కేసు పెట్టించారని ఆరోపించారు. మరోవైపు.. పోక్సో కేసులో కూడా పిటిషనర్‌కు కొన్ని హక్కులు ఉంటాయని పేర్కొన్న లాయర్ నిరంజన్ రెడ్డి.. పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోకి పిటిషనర్ రారని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 74, 75 కింద ఆరోపణలు రుజువు కాలేదని వివరించారు. తన క్లెయింట్ బండి భగీరథ్ నుంచి బాలిక ఫ్యామిలీ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు లాయర్ తెలిపారు. అంతేకాకుండా తన క్లెయింట్‌ను బెదిరించడమే కాకుండా.. ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరింపులకు దిగిందని వాదించారు. ఇక బాలిక, ఆమె కుటుంబం బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేని బండి భగీరథ్.. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హనీట్రాప్ కేసు పెట్టినట్లు తెలిపారు. కేంద్రమంత్రి కుమారుడు కావడంతో వారు తన క్లెయింట్‌పై కుట్ర చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకసారి ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత సెక్షన్లను మార్చడం చాలా అనుమానాలకు దారి తీస్తోందని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. కావాలనే సెక్షన్లను మార్చారని ఆరోపించారు. ఇది ఒక కుట్రగా భావించాలని కోర్టుకు విన్నవించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత.. నిజానిజాలు తెలుసుకుని సెక్షన్లను మార్చినట్లు బాధితురాలి తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ పీపీ నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు వెకేషన్ బెంచ్.. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‎పై విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా బాధితురాలి పుట్టిన తేదీకి సంబంధించి వేర్వేరు సర్టిఫికెట్లు ఉండటం.. గతంలో ఆమె రాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు ఫైల్ చేసిన ఛార్జిషీట్‌లో ఆమె వయసు ఎక్కువగా ఉండటం వంటి వాటిపై విచారణ జరపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆమె వయసుపై పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. అయితే.. ఈ కేసులో ముందస్తు బెయిల్ వచ్చే వరకు పోలీసులు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అతని తరఫు లాయర్ కోరగా.. ఈ కేసులో మధ్యంతర బెయిల్‎పై శుక్రవారం రోజున విచారణ జరుపుతామని హైకోర్టు తేల్చి చెప్పింది.